BigTV English

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

IRCTC New Service: ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రయాణం చేయడానికి చాలా మంది ట్రైన్ జర్నీని ఎంచుకుంటారు. కొన్నిసార్లు నచ్చిన సీటు దొరక్క చాలా ఇబ్బంది పడతారు. రైలు ప్రయాణంలో మజాను ఎంజాయ్ చేయలేరు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)  గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంట్లో కూర్చొనే తమకు నచ్చిన సీట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించబోతున్నది. ఇంకా చెప్పాలంటే, బుక్ మై షోలో ఎలాగైతే నచ్చిన సీటును సెలెక్ట్ చేసుకుంటారో, అలాగే రైలు సీటును బుక్ చేసుకోవచ్చు.


బుకింగ్ కు ముందు ఖాళీగా ఉన్న బెర్తులను చెక్ చేసుకోండి

ప్రస్తుతం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఫీచర్ ను డెవలప్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ప్రారంభించిన తర్వాత  దేశ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు తమ ఇళ్ల నుంచే ఖాళీగా ఉన్న బెర్త్‌ల లిస్టును చూసుకోవచ్చు. ఖాళీలను బట్టి ప్రయాణీకులు అప్పర్, లోయర్ లేదంటే విండో సీటును ఎంచుకోవచ్చు. ప్రయాణీకులు నచ్చిన సీటు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే, వారికి నచ్చిన సీటు ఎంచుకునేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు IRCTC వెల్లడించింది. రైల్వే వ్యవస్థలో ఇదో విప్లవాత్మక మార్పుగా అభివర్ణించింది.


సీట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ తో టికెట్ బుకింగ్

వాస్తవానికి ఒక్కో కోచ్‌ లో దాదాపు 110 సీట్లు ఉంటాయి. వాటిలో స్లీపర్ కోచ్  సీట్లు ఐదు భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ఇందులో లోయర్ బెర్త్, సెకెండ్ మిడిల్ బెర్త్, థర్డ్ అప్పర్ బెర్త్, ఫోర్త్ సైడ్ లోయర్ బెర్త్తో పాటు ఫిప్త్ సైడ్ అప్పర్ బెర్త్ ఉన్నాయి.  IRCTC కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైలు టిక్కెట్‌ ను బుక్ చేసే సమయంలో  సీట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.  ఆ తర్వాత రైల్లోని ఆయా కోచ్ లలో అందుబాటులో ఉన్న సీటర్ల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన చోట సీట్ ను ఎంపిక చేసుకుని సబ్ మిట్ చేయాలి. వెంటనే మీ టిక్కెట్ బుక్ అవుతుంది.

రైల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ఎలా తెలుసుకోవాలంటే?

IRCTC లేటెస్ట్ ఫీచర్ తో రైలు పేరు, జర్నీ డేట్ ను ఎంటర్ చేసినప్పుడు..  ఏసీ క్లాస్ నుంచి స్లీపర్ క్లాస్ వరకు ఏయే కోచ్‌లలో ఏయే సీట్లు ఖాళీగా ఉన్నాయో వారి మొబైల్ లో కనిపిస్తుంది. దీనితో పాటు, ఇప్పటికే బుక్ అయిన సీట్ల వివరాలు కూడా కనిపిస్తాయి. ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను గుర్తించి నచ్చిన సీట్ ను బుక్ చేసుకోవచ్చు. రైలు ప్రయాణాన్ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.

కొత్త సాఫ్ట్ వేర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?  

ప్రయాణీకులు తమ ఫేవరెట్ సీట్లను బుక్ చేసుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్ వేర్ దాదాపు పూర్తైందని  రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాప్‌ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రయాణీకులు ఇంటి నుంచే తమకు ఇష్టమైన సీట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే, నచ్చిన సీట్లను బుక్ చేసుకోవడానికి అదనంగా ఏమైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా? అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

Read Also: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×