E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu : జ్యోతిషుడుగా మారిన మణికంఠ.. హద్దులు దాటేస్తున్న లవ్ ట్రాక్..

Bigg Boss 8 Telugu : జ్యోతిషుడుగా మారిన మణికంఠ.. హద్దులు దాటేస్తున్న లవ్ ట్రాక్..
Advertisement

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో మొన్నటివరకు సోనియా, పృథ్వి, నిఖిల్ లవ్ ట్రాక్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు మరో జంట తయారైంది. ఇప్పుడిప్పుడే ప్రేమ చిగురిస్తుంది. అందుకే రోజు రోజుకు హద్దులు దాటెస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో కాస్త కొత్తగా చూపించారు. బిగ్‌బాస్ మస్త్ ప్లాన్ చేశాడబ్బా. ముందు జాతకాలు అంటూ అందరినీ నవ్వించి.. ఆ తర్వాత వారివారి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ రుచి చూపించి ఏడిపించేశాడు. ముందుగా యష్మీ గురించి మణికంఠ చెప్పడం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

బిగ్ బాస్ సీజన్ 8 33 వ ఎపిసోడ్ లో కాస్త ఎమోషనల్ టచ్, ఇంకాస్త ఫన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మణికంఠ జ్యోతిష్యం కడుపుబ్బా నవ్వించింది. మొన్నటి ఎపిసోడ్ లో ఆదిత్య ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎలిమినేట్ అయిన విషయం గురించి హౌస్ లో పెద్ద చర్చలే జరిగాయి. విష్ణుప్రియ-యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆయన ఎంత తిట్టుకొని ఉంటారో నన్ను ప్రేరణని.. మేమిద్దరమే నామినేట్ చేశాం ఈ వీక్ అంటూ యష్మీ చెప్పింది.. నేను ఈ వీక్ నామీనేషన్ వేద్దామని అనుకున్న వారంతా ముందుగానే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్నారని మాట్లాడుకుంటారు. నబీల్ కౌంటర్ ఇస్తూ అదేంటి సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా మరెందుకు బ్లాంక్ అంటూ అన్నాడు.. సీత మణికంఠ పై అరుస్తుంది దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక తర్వాత బిగ్ బాస్ అందరికీ ఒక ఫన్నీ టాస్క్ ఇస్తాడు. నేను చెప్పిందే జరుగుద్ది.. జాతకం చెప్పాలి. అంటూ సాగిన ఈ టాస్కులో మణికంఠ హౌస్‌మెట్స్ అందరికీ జాతకం చెప్పాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మణికంఠ పేరు మార్చుకొని బాగానే మ్యానేజ్ చేస్తాడు. అందరికీ వారికి మాటలను బట్టి జాతకం చెప్పి ఆకట్టుకుంటాడు. నిన్నటి ఎపిసోడ్ కు ఇదే హైలెట్ అన్నమాట.. ఇక ముందుగా విష్ణు ప్రియా ఈ హౌస్‌లో ఒకరిని ట్రై చేస్తున్నా.. సెట్ అవుతుందా అంటూ పృథ్వీ గురించి అడిగింది విష్ణు. దీనికి బిగ్‌బాస్ పంజరంలో ప్రేమ పక్షులు అంటే మీరేనమ్మా.. వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే మాత్రం మీ ప్రేమకి క్రాక్ పడుతుందని హెచ్చరిస్తాడు. యష్మీ ఇలా ఒక్కొక్కరు తమ జాతకం చెప్పించుకుంటారు. ఈ ఎపిసోడ్ లో ఇంటి నుంచి వచ్చిన వంటలను కూడా బిగ్ బాస్ అందిసస్తాడు. ఇక ఈరోజు నైనిక బయటకు వెళ్తే, వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందని సమాచారం..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×