E-Paper
Advertisement

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి అన్పించే మూవీ

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి అన్పించే మూవీ

OTT Movie : క్రైమ్ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయంటే ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్న కొద్ది దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే ముందు ఉండే సస్పెన్స్ తో నరాలు కట్ అవుతాయేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి థ్రిల్ కోసమే చాలామంది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను చూస్తూ ఉంటారు.. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. ఇందులో సీను సీనుకో ట్విస్ట్ తో ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో హీరోయిన్ ఒక పాపులర్ లాయర్. ఓ బిజినెస్ మ్యాన్ జనాల దగ్గర డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నాడనే నేరం కింద అతన్ని జైలుకు పంపిస్తుంది. ఇక జనం తరఫున వాదించి ఒక మంచి లాయర్ గా బాగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమ్ముడు పాలిటిక్స్ లో పోటీ చేయడానికి సిద్ధమవుతాడు. దీంతో హీరోయిన్ తమ్ముడికి సపోర్ట్ గా ప్రచారంలో కూడా పాల్గొంటుంది.. అదే సమయంలో ఆమె మీడియా ముందుకు వెళ్లి తమ్ముడిని గెలిపించాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ మీ తండ్రి చనిపోయాడు కదా అంటూ ఏదో అడిగే లోపల అసలు ఆ విషయం గురించి తెలియని హీరోయిన్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక తండ్రికి హెల్త్ బాలేక ఒక్కడే హాస్పిటల్ కి బయలుదేరి, అంతలోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడనే విషయం హీరోయిన్ కి ఎవరో చెప్తారు. కానీ ఈ విషయాన్ని ఆమె తమ్ముడు అస్సలు నమ్మడు. మరోవైపు హీరోయిన్ తండ్రి తన పర్సనల్ లాయర్ కి ఆస్తి పంపకాల గురించిన వీలునామా ముందే ఇచ్చి ఎవరెవరికి ఏం చెందాలో అందులో క్లియర్ గా రాసి పెడతాడు. దాని ప్రకారం ఆ లాయర్ వారసులకి చెందాల్సిన ఆస్తిని పంచుతాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఒక పెన్ డ్రైవ్, కీ ఇవ్వమని తండ్రి రాస్తాడు.

తీరా అదేంటి అని చూస్తే హీరోయిన్ తండ్రి మాట్లాడుతూ ‘నీకు తెలియకుండా దాచిపెట్టిన ఒక నిజం. నీకు ఇచ్చిన తాళం చెవితో కనిపెట్టాలి’ అని చెప్తాడు. దీంతో ఆ నిజాన్ని తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటుంది హీరోయిన్. అలా వెతుకుతూ వెతుకుతూ ఓ అడవిలోకి వెళ్ళగా అక్కడ ఓ ఇల్లు, అందులో ఒక వింత మనిషి ఉంటారు. అసలు ఆ ఫారెస్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరు? హీరోయిన్ తండ్రి అతడి గురించి ఎందుకు ప్రస్తావించాడు? చివరికి హీరోయిన్ ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఇన్హెరిటెన్స్’ అనే ఈ సినిమాపై ఒక లుక్ వేయాల్సిందే. కాకపోతే ఈ మూవీ ప్రస్తుతం రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×