BigTV English

Indian billionaires: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు

Indian billionaires: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు

Indian billionaires: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ దేశంలో అన్ని రంగాలపై క్రమంగా పడుతోంది. స్టాక్ మార్కెట్ నేల చూపుల విషయం కాసేపు పక్కనబెడదాం. రేపటి రోజుల ఇంకా ఎలాంటి టారిఫ్ విధిస్తారోనన్న భయం బిజినెస్‌మేన్లను వెంటాడుతోంది. ట్రంప్ దెబ్బకు ఒక్కరోజులో నలుగురు భారతీయుల కుబేరుల సంపద 10.3 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ వెల్లడించింది.


కరిగిపోతున్న భారత్ కుబేరుల సంపద 

భారతీయుల సంపన్నుల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు. వారిలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ ఫ్యామిలీ, శివ్ నాడార్. సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. దాని దెబ్బకు ఆయా వ్యాపారవేత్తల సంపద ఒక్క రోజు భారీగా తగ్గింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ స్వయంగా వెల్లడించింది. దాదాపు 10.3 బిలియన్ డాలర్లు సంపద క్షీణించినట్లు వెల్లడించింది.


ముకేశ్ అంబానీ

దేశంలో అత్యంత ధనికుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన సంపద విలువ ఒక్కరోజు 3.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయన సంపద 87.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

గౌతమ్ అదానీ

ఇక అదానీ గ్రూప్‌ను నడుపుతున్న గౌతమ్ అదానీ సంపదలో 3 బిలియన్ల డాలర్ల తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఆయన నికర విలువ ఇప్పుడు 57.3 బిలియన్లు డాలర్లకు చేరింది.

ALSO READ: గుడ్ న్యూస్.. వెజ్, నాన్ వెజ్ ధరల తగ్గుదల

సావిత్రి జిందాల్

జిందాల్ గ్రూప్ యజమానులైన సావిత్రి జిందాల్ ఫ్యామిలీ 2.2 బిలియన్లు డాలర్లను కోల్పోయింది. ప్రస్తుతం వారి సంపద 33.9 బిలియన్లు పడిపోయింది. ప్రపంచ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు ఆమె.

శివ్ నాడార్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు శివ్ నాడార్ ఈ జాబితాలోకి చేరిపోయారు. సోమవారం ఒక్కరోజు ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూసింది. దీంతో ఆయన సంపద విలువ ప్రస్తుతానికి 30.9 బిలయన్లు డాలర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. దీంతో వ్యాపారవేత్తల సంపద ఆవిరైపోయింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో మాంద్యం భయాల కారణంగా పెట్టుబడిదారులు ఆలోచనలోపడ్డారు. సోమవారం రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 2,200 పాయింట్లు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 700 పాయింట్లు పైగానే కోల్పోయింది. సెన్సెక్స్ బోర్డులో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో అన్ని సూచీలకు సెగ తగిలింది.

అమెరికా కుబేరుల సంపద కూడా

ఇక ప్రపంచ కుబేరుల పరిస్థితికి వద్దాం. 2025లో వారెన్ బఫెట్ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 155 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలాన్ మస్క్ సంపద 130 బిలియన్ డాలర్లు తగ్గి 302 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జెఫ్ బెజోస్ సంపద 45.2 బిలియన్ డాలర్లు తగ్గి 193 బిలియన డాలర్లకు చేరుకుంది.

మార్క్ జూకర్ బర్గ్ సంపద 28.1 బిలియన్ డాలర్లు తగ్గి 179 బిలియన్ డాలర్లు చేరింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 18.6 బిలియన్లు తగ్గి 158 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బిల్ గేట్స్ సంపద సైతం 3.38 బిలియన్ డాలర్లు క్షీణించింది. 155 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ తెలిపింది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×