OTT Movie : కొన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాల స్టోరీ ఊహకు అందని రీతిలో తిరుగుతాయి. వీటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్ముకుంటుంది. అక్కడ కొన్ని వింత జీవులు మారణ హోమం సృష్టిస్తాయి. ఆ తర్వాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మూవీ పేరు ‘ది మిస్ట్’ (The Mist). ఇది స్టీఫెన్ కింగ్ 1980లో రాసిన ‘ది మిస్ట్’ అనే నవలఆధారంగా ఫ్రాంక్ డారబాంట్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా ఒక చిన్న పట్టణంలో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక పొగమంచు ఊహించని రీతిలో వచ్చి, ఆ ప్రాంతాన్ని కప్పేస్తుంది. ఒక వింతైన ప్రమాదకరమైన జీవులను తీసుకొస్తుంది. ఈ మూవీ 60 మిలియన్లకు పైగా వసూలు చేసింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బ్రిడ్జ్‌టన్ అనే చిన్న పట్టణంలో ఒక రాత్రి భయంకరమైన తుఫాను సంభవిస్తుంది. ఈ తుఫాను కారణంగా డేవిడ్ ఇంటికి నష్టం వాటిల్లుతుంది. మరుసటి రోజు డేవిడ్ తన ఎనిమిది సంవత్సరాల కుమారుడు బిల్లీతో కలిసి, తమ పొరుగింటి బ్రెంట్ నార్టన్‌తో కలసి స్థానిక సూపర్‌మార్కెట్‌కు సామాన్లు కొనడానికి వెళ్తాడు. అయితే, వారు షాపింగ్ చేస్తున్న సమయంలో ఒక అసాధారణమైన, దట్టమైన పొగమంచు పట్టణాన్ని కమ్ముకుంటుంది. ఈ పొగమంచు వచ్చిన కొద్ది సేపటికే, ఒక వ్యక్తి భయంతో సూపర్‌మార్కెట్‌లోకి పరుగెత్తుకొని వస్తాడు. పొగమంచులో ఏదో ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు. త్వరలోనే బయట దాడి చేసే వింత జీవులు ఉన్నాయని తెలుస్తుంది. ఒక యువకుడు జనరేటర్ రిపేర్ చేయడానికి బయటకు వెళ్లినప్పుడు, ఆ జీవులచే దాడికి గురై చనిపోతాడు. దీంతో లోపల ఉన్నవారు తలుపులు బందించి, బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడతారు. సూపర్‌మార్కెట్‌లో చిక్కుకున్న వారిలో డేవిడ్, బిల్లీ, అమండా వంటి కొందరు మిగతా వాళ్ళకి సహాయపడేందుకు ప్రయత్నిస్తారు.
అయితే, మిసెస్ కార్మోడీ అనే మతోన్మాద మహిళ పొగమంచును దైవ శిక్షగా చెప్తుంది. ప్రజలను భయపెట్టడం మొదలుపెడుతుంది. ఆమె మాటలు నమ్మిన కొందరు, దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి బలులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. డేవిడ్ నేతృత్వంలోని ఒక చిన్న బృందం మందుల కోసం సమీపంలోని ఫార్మసీకి వెళ్తుంది. కానీ అక్కడ సాలెపురుగుల వంటి జీవుల దాడిలో కొందరు చనిపోతారు. ఇక ఆ వింతజీవులకి కొంతమంది ఘోరంగా బలి అవుతుంటారు. ఎటువంటి ఆశ లేని పరిస్థితిలో, డేవిడ్ తన వద్ద ఉన్న నాలుగు బుల్లెట్లతో అమండా, డాన్, ఇరీన్, బిల్లీలను కాల్చి చంపుతాడు. వారిని ఆ జీవుల ఘోరమైన దాడి నుండి కాపాడటానికి ఇలా చేస్తాడు. అయితే అతనికి తనను తాను చంపుకోవడానికి బుల్లెట్ లేకపోవడంతో, అతను కారు నుండి బయటకు వచ్చి, ఆ జీవులకు ఆహారం అవ్వడానికి సిద్ధపడతాడు. చివరికి ఆ వింత జీవుల చేతిలో డేవిడ్ బలి అవుతాడా ? అవి ఎక్కడినుంచి వచ్చాయి ? దీనికి ముగింపు ఎలా ఉంటుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ సినిమాను చూడండి.