ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆపిల్ సెప్టెంబర్ 9, మంగళవారం తన Awe-dropping ఈవెంట్‌ను నిర్వహించడానికి అన్ని రకాలుగా సిద్ధమైంది. అమెరికాలోని కుపెర్టినోలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో iPhone 17 సిరీస్‌తో పాటు, కొత్త Apple Watch మోడల్స్, అప్‌డేటెడ్ AirPods విడుదల కానున్నాయి. అయితే, అధికారిక ప్రకటనకు ముందే టిప్‌స్టర్ వంటి కొన్ని టెక్ న్యూస్ ప్లాట్ ఫారం లీక్‌ల ద్వారా iPhone 17 సిరీస్ గురించి అనేక ముఖ్యమైన విషయాలు మార్కెట్లో చాలా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో ఉన్న లీకుల ప్రకారం. ఐఫోన్ 17 డిజైన్ అలాగే కెమెరాలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది.టెక్ నిపుణుల అంచనా ప్రకారం Dbrand, Nudient, Pitaka వంటి కంపెనీలు తమ iPhone 17 సిరీస్ కేసుల్లో పలు మార్పులు చేశాయి. ఈ వివరాల ప్రకారం, కొత్త iPhone 17 సిరీస్‌లో డిజైన్ అలాగే బ్యాటరీ విషయంలో ఒక ప్రధాన మార్పు ఉండనున్నట్లు తేలింది.
iPhone 17 Air:
కొత్తగా వస్తున్న ఈ బేసిక్ మోడల్ ఐ ఫోన్ ఒకే కెమెరాతో రానున్నట్లు సమాచారం లీక్ అవుతోంది. అయితే, దీని కెమెరా మాడ్యూల్ ఫోన్ వెనుక భాగం మొత్తం వెడల్పుగా ఉండనుంది. .
iPhone 17 Pro:
ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ మరింత పెద్దగా ఉంది. కెమెరా ఫ్లాష్ కుడి వైపుకి మార్చారు. ఈసారి ఆపిల్ లోగో స్థానం కూడా మారిపోయింది. టైటానియం బాడీ బదులుగా iPhone 17 Pro మోడల్స్ అల్యూమినియం బాడీతో రాబోతున్నట్లు కొన్ని సోషల్ మీడియా లీక్స్ ద్వారా తెలుస్తోంది.
బ్యాటరీ విషయంలో వస్తున్న మార్పులు ఇవే:
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన చైనా CQC సర్టిఫికేషన్ ప్రకారం, iPhone 17 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో ప్రధానంగా iPhone 17 Air: 3,149mAh బ్యాటరీతో రానుంది. అలాగే iPhone 17 Pro: USAలో 4,300mAh, చైనాలో 4,000mAh బ్యాటరీతో రానుంది. అలాగే iPhone 17 Pro Max: USAలో 5,100mAh, చైనాలో 4,900mAh బ్యాటరీతో రానుంది. అయితే iPhone 17 Pro Max లోని 5,100mAh బ్యాటరీతో రానుంది. ఇది ఆపిల్ చరిత్రలోనే తొలిసారిగా 5,000mAh కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న మొదటి బ్యాటరీ ఫోన్ ఇదే కావడం విశేషం. ఆపిల్ ఆనవాయితీ ప్రకారం, కొత్త iPhone 17 Pro మోడల్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడల్స్‌ను నిలిపివేస్తారు.
ఐ ఫోన్ 17 ధర ఎంతంటే..?
ఇక ధరల విషయానికి వస్తే గత మోడల్స్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ టెక్నాలజీ న్యూస్ పోర్టల్ అంచనా ప్రకారం iPhone 17 Pro భారతదేశ ప్రారంభ ధర రూ. 1,34,990 ఉండే అవకాశం ఉంది. iPhone 17 Pro Max ప్రారంభ ధర రూ. 1,64,990 ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కొత్త మోడల్స్ లాంచ్ తర్వాత iPhone 16 Pro అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండదు.