Bigg Boss Telugu 9 Day 1: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సీజన్ కూడా బోలెడు అన్ని ట్విస్ట్ లతో సాగనుంది. అయితే మొత్తానికి ఈ సీజన్ లో డే వన్ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది.
డే వన్ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పూర్తిస్థాయిలో అందరు వ్యక్తిత్వాలు బయటపడలేదు గాని మెల్లమెల్లగా ఒక్కొక్కరి రంగు బయటపడుతుంది. అయితే డే వన్ ఎపిసోడ్లో హైలెట్ అయింది మాత్రం మాస్క్ మెన్ హరీష్. అలానే హరీష్ కి ఇమ్మానుయేల్ కి మధ్య గొడవలు జరగడం వలన ఎక్కువ ఫోకస్ వాళ్ల మీదకు వెళ్ళిపోతుంది.
బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత కొన్ని ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. బాగా అలవాటు పడిన ఫుడ్ కానీ, ఇంకేమైనా కానీ సడన్ గా వదులుకోవాలి అంటే మామూలు ఇబ్బందిగా అనిపించదు. అయితే బిగ్ బాస్ షో కి మొదట కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది తనుజ. తనుజ రావడంతోనే తాను వంటలు బాగా చేస్తాను అంటూ నాగార్జున గారితో స్టేజ్ పైన చెప్పింది.
తొమ్మిది పదాల్లో నీ గురించి చెప్పు అంటే తన గురించి ఒక్కో మాట చెబుతూ వచ్చింది. అయితే ఒక తరుణంలో ఇన్నోసెంట్ అని కూడా చెప్పుకుంది. నాగార్జున కూడా నువ్వు ఇన్నోసెంట్ అంటే నమ్మేలా లేదు అని స్టేజ్ పైన అనేశారు. డే 1 లో మాత్రం తన ఇన్నోసెంట్ కాదు అని అర్థమయిపోయింది.
మాస్క్ మాన్ హరీష్ కాఫీ పొడిని ఎవరికి తెలియకుండా దొంగలించి నేనొక టిష్యూ పేపర్లో కొంత దాచుకుంటాను అని భరణితో చెబుతుంది తనుజ. కెమెరాల్లో కనిపించేస్తావు కదా ఏం చేస్తావ్ అని భరణి అడిగితే కనిపిస్తే కనిపించని. మా ఇంట్లోనే నేను దొంగతనం చేస్తాను బిగ్ బాస్ హౌస్ లో చేయనా అంటూ ఫన్నీగా భరణితో మాట్లాడింది.
ఒకవేళ హరీష్ దగ్గర నుంచి కాఫీ పొడిని దొంగలిస్తే దీనిపైన హరీష్ ఎలా రియాక్ట్ అవుతాడు వేచి చూడాలి. ఎందుకంటే హరీష్ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఎందుకు సీరియస్ అవుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది.
Also Read: Bigg Boss 9 Day 2 : రీతూ లవ్ ట్రాక్ సెట్ అయిపోయింది, ముందు ముందు వీళ్ళిద్దరూ ఇంకేం చేస్తారో