BigTV English

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

IRCTC Tatkal Ticket Bookings Tip: భారతీయ రైల్వే సర్వీసుల ద్వారా రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ట్రైన్ జర్నీ కోసం ఆన్ లైన్ వేదికగా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. అత్యవసర ప్రయాణం కోసం చాలా మంది తత్కాల్ టిక్కెట్లు తీసుకుంటారు. అయితే, తత్కాట్ టిక్కెట్ల బుకింగ్ చేయాలంటే తన ప్రాణం తోకకు వస్తుంది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా తత్కాల్ టిక్కెట్లను కన్ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దంఆ..


వీలైనంత త్వరగా టికెట్ బుక్ చేసుకోండి..

రైలు ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లను రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకొస్తారు. బుకింగ్ లు ప్రారంభం అయిన వెంటనే సైట్ ఓపెన్ చేసి వీలైనంత త్వరగా టికెట్ బుక్ చేసుకోవాలి. టిక్కెట్ దక్కించుకునేందుకు వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలి. బుకింగ్ లు మొదలయ్యాక ఎంత త్వరగా టికెట్ బుక్ చేసుకుంటే అంత త్వరగా టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.


 ఒకేసారి పలు రకాల ప్రయత్నాలు

తత్కాల్ టిక్కెట్ల కోసం చాలా మంది ప్రయత్నిస్తారు. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు మొబైల్, ల్యాప్ టాప్, వీలుంటే కంప్యూటర్ అన్నింటి నుంచి టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. వేర్వేరు ఫోన్ నెంబర్లు, వేర్వేరు లాగిన్ ఐడీల ద్వారా ప్రయత్నించడం వల్ల.. ఏదో ఒక చోట సక్సెస్ ఫుల్ గా టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రయాణీకుల వివరాలను రెడీగా ఉంచుకోండి

తత్కాల్ టిక్కెట్లను ఫాస్ట్ గా బుక్ చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. బుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టే ముందు ప్రయాణీకుల  పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్లు, ఇతర అవసరమైన సమాచారాన్ని రెడీగా ఉంచుకోవాలి. ఈ ప్రిపరేషన్ కారణంగా బుకింగ్ ప్రక్రియ త్వరగా పూర్తై టిక్కెట్లు కన్ఫాయ్ అయ్యే అవకాశం ఉంటుంది.

నెట్ కనెక్షన్ ఒకటికి రెండుసార్లు పరిశీలించండి

తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌ చాలా ఫాస్ట్ గా చేయాల్సి ఉన్నందున, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ముఖ్యం. చక్కటి ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రాంతంలో ఉండి టిక్కెట్లను బుకింగ్ కు లాగిన్ కావడం మంచిది.

ఈజీ పేమెంట్ ఆప్షన్స్

తత్కాల్ టికెట్ బుకింగ్ వేగంగా చేయాల్సి ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు వేగవంతమైన పేమెంట్స్ కోసం మొబైల్ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్, UPI వంటి పేమెంట్ ఆప్షన్స్ ను ఉపయోగించాలి. IRCTC వాలెట్‌ని ఉపయోగించడం వల్ల మీ చెల్లింపు ప్రక్రియను మరింత ఫాస్ట్ గా కొనసాగే అవకాశం ఉంటుంది.

బుకింగ్ ఏజెంట్ సాయం

ఒకవేళ మీకు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేయడం ఇబ్బందిగా ఉంటే  బుకింగ్ ఏజెంట్ సాయం తీసుకోవాలి.  ఏసీ కోచ్‌లను ఉదయం 10 గంటల నుంచి, స్లీపర్ కోచ్‌లను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బుక్ చేసుకోవడానికి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. వారి సాయంతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్ టిక్కెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే?

వీకెండ్ లో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేస్తారు. అందుకే, వీలైనంత వరకు ఈ సమయంలో తత్కాల్ టిక్కెట్లను పొందడం కష్టం అవుతుంది.

స్లాట్ తెరవడానికి  ముందు లాగిన్ చేయండి

AC కోచ్‌ల కోసం తత్కాల్ టిక్కెట్లు.. ప్రయాణానికి ముందు రోజు  ఉదయం 10 నుంచి  11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. స్లాట్ ప్రారంభం కావడానికి కొద్ది సేపటి ముందే లాగిన్ కావడం మంచిది. సరిగ్గా ఉదయం 10 గంటలకు లాగిన్ కాకుండా, కాస్త ముందుగానే లాగిన్ అయి రెడీగా ఉంటే ఈజీగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.  నాన్-ఎసి స్లీపర్ కోచ్‌ల కోసం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి స్లాట్ ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది.  బుకింగ్ ప్రారంభం కావడానికి 2 నుంచి 3 నిమిషాల ముందు లాగిన్ అవ్వడం వలన ఈజీగా టికెట్ పొందే అవకాశం ఉంటుంది.

Read Also:ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Related News

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Big Stories

×