BigTV English
Advertisement

John Amos : టీవీ డాడ్ జాన్ అమోస్ ఇకలేరు… హాలీవుడ్ లో విషాదం

John Amos : టీవీ డాడ్ జాన్ అమోస్ ఇకలేరు… హాలీవుడ్ లో విషాదం

John Amos : హాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఆయన వయసు 684 ఏళ్లు కాగా, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన ఆగష్టు 21న చనిపోతే, జాన్ ఫ్యామిలీ ఈ విషయాన్ని అక్టోబర్ 1న అఫిషియల్ గా ప్రకటించి షాక్ ఇచ్చింది.


జాన్ అమోస్ ఇక లేరంటూ కొడుకు ప్రకటన  

టెలివిజన్ సిరీస్ ‘గుడ్ టైమ్స్‌’లో తన నటనకు ప్రసిద్ధి చెందిన జాన్ అమోస్ కన్నుమూశారనే విషయాన్ని అతని కొడుకు మంగళవారం ప్రకటించారు. జాన్ కుమారుడు కెల్లీ క్రిస్టోఫర్ అమోస్ తన తండ్రి ఆగస్టు 21న మరణించినట్లు ధృవీకరించారు. అమోస్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు. అలాగే ఐదు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగారు.


జాన్ సినీ ప్రయాణం 

జాన్ 1939 డిసెంబ‌ర్‌ 27న జ‌న్మించగా, 1971లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి 2023 వ‌ర‌కు గ్యాప్ ఇవ్వకుండా ఎన్నో  సినిమాలు, టీవీ సిరీస్‌ల‌లో నటించారు. 1977లో వ‌చ్చిన ‘రూట్స్‌’, ‘గుడ్ టైమ్స్’ అనే సిరీస్‌ లు ఆయనకు ఓవ‌ర్ నైట్ స్టార్‌ డంను తెచ్చి పెట్టాయి. తన కెరీర్ లో జాన్ తుది శ్వాస విడిచేదాకా  సుమారు 50కి పైగా సినిమాల్లో, 100కు పైగా సీరియ‌ల్స్‌, సిరీస్‌ల‌లో నటించి అలరించారు. ఆయన ఎక్కువగా తండ్రి పాత్రలకు పాపులర్ కావడంతో అభిమానులు జాన్ ను ‘టీవి డాడ్’ అని పిలుచుకునేవారు. జాన్ చివ‌ర‌గా 2023లో రిలీజైన హాలీవుడ్ మూవీ ‘ది లాస్ట్ పైఫిల్ మ్యాన్’లో కన్పించారు. కాగా జాన్ అమోస్ మినీ సిరీస్ ‘రూట్స్‌’లో కింటే పాత్రను పోషించి, ఈ సిరీస్ లో అద్బుతమైన నటనను కనబరిచినందుకు జాన్ ఎమ్మీ అవార్డుకు ఎంపికయ్యాడు.

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ 

అయితే జాన్ సినిమాల్లోకి అడుగు పెట్టడానికంటే ముందే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలని అనుకున్నారట. అనుకోవడమే కాదు కొలరాడో స్టేట్ యూనివర్శిటీకి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆడారు కూడా. కానీ కొంతకాలం తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో తనకు ఇష్టమైన ఫుట్ బాల్ గేమ్ ను పక్కన పెట్టేసి, సినిమాలపై దృష్టి పెట్టారు జాన్. మరోవైపు జాన్ సైట్‌లో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. అతను ‘గుడ్ టైమ్స్’ సిరీస్ రచయితలతో ఆఫ్రికన్ అమెరికన్లును చిత్రీకరించే విధానంపై ఓపెన్ గానే విబేధించేవారట. అందుకే మూడు సీజన్ల తర్వాత జాన్ ను ‘గుడ్ టైమ్స్’ సిరీస్ నుండి తీసేశారు. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో జాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఇప్పుడు జాన్ కన్ను మూశారు అన్న విషయం తెలిసిన ఆయన అభిమానులు, హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. కానీ ఆయన చనిపోయిన 50 రోజుల తరువాత జాన్ ఫ్యామిలీ ఈ విషయాన్ని బయట పెట్టడం అందరికీ తేరుకోలేని షాక్ ఇచ్చింది.

Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×