BigTV English

CM Revanthreddy: హస్తినలో ఏం జరిగింది? కూల్చివేతలపై హైకమాండ్‌కు సీఎం ఏం చెప్పారు?

CM Revanthreddy: హస్తినలో ఏం జరిగింది? కూల్చివేతలపై హైకమాండ్‌కు సీఎం ఏం చెప్పారు?

CM Revanthreddy: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన టూర్‌లో ఏం జరిగింది? కూల్చివేతలపై హైకమాండ్‌కు ఏం చెప్పారు? హైకోర్టు లేవనెత్తిన అంశాలపై నేతలేమన్నారు? ముఖ్యమంత్రి సమాధానాలతో అధిష్టానం కూల్ అయ్యిందా? మరోసారి హస్తినకు రావాలని సూచన చేసిందా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.


మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి గతరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ ప్రముఖులతో రాజకీయాలపై చర్చించారు. తొలుత పార్టీ చీఫ్ మలిఖార్జున ఖర్గేను పరామర్శించారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల గురించి చర్చించుకున్నారు.

అనంతరం కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్.  ఆ సమయంలో ఎంపీ, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వచ్చారు. తెలంగాణలో రాజకీయాలు, మూసీ, హైడ్రా, హైకోర్టు కామెంట్స్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం.


పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. హైడ్రా కూల్చివేతలు, దానిపై వస్తున్న స్పందనను ముఖ్యనేతలకు వివరించారట సీఎం రేవంత్‌రెడ్డి. ఒక విధంగా పార్టీకి మంచి పేరు వస్తుందని, దాన్ని తట్టుకోలేక విపక్షం రాజకీయం చేస్తోందని వివరణ  ఇచ్చారని సమాచారం.

ALSO READ: చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా, సంతకాలు ఫోర్జరీపై

ప్రతీ ఏడాది సిటీ జనాభా పెరుగుతోందని, ఇలాంటి సమయంలో చర్యలు తీసుకోకుంటే ఊహించని విధంగా డ్యామేజ్ జరుతుందనే విషయాన్ని నొక్కి వక్కానించినట్టు సమాచారం. అటు మూసీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎం.

మూసీ నిర్వాసితులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారట. వారికి ఏ మాత్రం నష్టం కలిగించకుండా తీసుకున్న నిర్ణయాలను నేతల దృష్టికి తీసుకెళ్లారట. నిర్వాసితులకు సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పిల్లలకు విద్యా సంవత్సరం నష్టపోకుండా సమీపంలో స్కూళ్లలో అడ్మిషన్లు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలకు వివిధ సంఘాల ద్వారా చేయూత ఇవ్వడం చేస్తున్నట్లు వివరించారట.

హైడ్రా విషయంలో న్యాయస్థానం చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారట సీఎం రేవంత్.  ఈ క్రమంలో ఎంపీ అభిషేక్ సింఘ్వీ నుంచి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యమంత్రి వివరణతో కీలక నేతలు హ్యాపీగా ఉన్నారని సమాచారం. అయితే రాహుల్ లేకపోవడంతో హర్యానా ఎన్నికల ప్రచారం తర్వాత వీలు చూసుకుని రావాలని చెప్పినట్టు ఢిల్లీ సమాచారం.  మొత్తానికి సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ మంచి ఫలితాలను ఇచ్చిందని అంటున్నారు.

Related News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Cockroach In Food: నానక్ రామ్ గూడ కృతుంగ హోటల్ లో షాకింగ్ ఘటన.. రాగి ముద్దలో బొద్దింక

Fire Accident: హైదరాబాద్‌లో పెట్రోల్ పంపులో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదేనా..?

Hydra Rules: ఇల్లు, స్థలాలు కొంటున్నారా? హైడ్రా రూల్స్ ఇవే.. ముందుగా ఏం చేయాలంటే?

Fire Accident: పెట్రోల్‌ బంక్‌ వద్ద కారులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు

Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు

CM Revanth Reddy: బెంగళూరుకు సీఎం రేవంత్.. అసలు విషం ఇదే

Big Stories

×