BigTV English

Unique Railway Stations: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Unique Railway Stations: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Unique Railway Stations in India: ఇండియన్ రైల్వేస్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారతీయ రైల్వే ఒకటి. దేశంలో అత్యధిక మందిని తమ గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఉల్లాసంగా జర్నీ చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు.   దేశ వ్యాప్తంగా సుమారు 7 వేలకంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.  వాటిలో కొన్ని రైల్వే స్టేషన్లు ప్రకృతి అందాలకు నెలవు కాగా, మరికొన్ని అత్యంత దూరపు సర్వీసులను నడిపే స్టేషన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. భారత్ లో కొన్ని స్పెషల్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


భారత్ లో స్పెషల్ రైల్వే స్టేషన్లు

భవానీ మండి రైల్వే స్టేషన్:


భవానీ మండి రైల్వే స్టేషన్ ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. సగం భాగం రాజస్థాన్ లో మిగతా సగం భాగం మధ్య ప్రదేశ్ లో ఉంటుంది. రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య విభజన కారణంగా, భవానీ మండి స్టేషన్‌లో ఆగిన ప్రతి రైలుకు రాజస్థాన్‌లో ఇంజిన్, మధ్యప్రదేశ్‌ లో దాని కోచ్ లను కలిగి ఉంటుంది. భవానీ మండి రైల్వే స్టేషన్‌కి ఒక చివర రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేయగా, మరో చివర మధ్యప్రదేశ్ బోర్డు పెట్టారు అధికారులు.

జార్ఖండ్‌ లో పేరులేని రైల్వే స్టేషన్:

రాంచీ నుంచి టోరీకి వెళ్లే రైలు జార్ఖండ్ లో ఓ పేరులేని రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎలాంటి బోర్డులు కనిపించవు. 2011లో మొదటిసారిగా ఈ స్టేషన్ నుంచి రైళ్లు నడపడం ప్రారంభించినప్పుడు.. దీనికి  బార్కిచాంపి అనే పేరు పెట్టాలని రైల్వే అధికారులు భావించారు. స్థానికుల నిరసనల కారణంగా, ఈ స్టేషన్ కు ఇప్పటికీ పేరు పెట్టలేదు.

బెంగాల్ లో పేరులేని మరో రైల్వే స్టేషన్:

బెంగాల్ రాష్ట్రంలోనూ ఓ పేరులేని రైల్వే స్టేషన్ ఉంది. బర్ధమాన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకురా-మస్‌ గ్రామ్ రైల్వే లైన్‌ లో ఓ రైల్వే స్టేషన్ ను 2008లో నిర్మించారు. ఈ స్టేషన్‌ కు మొదట రాయ్‌ నగర్ అని పేరు పెట్టారు. అయితే, స్టేషన్ పేరు మార్చాలని స్థానికులు రైల్వే బోర్డుకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి, ఈ స్టేషన్ పేరు లేకుండా నడుస్తోంది.

నవపూర్ రైల్వే స్టేషన్:

భారత్ లోని అత్యంత ప్రత్యేకమైన రైల్వే స్టేషన్లలో నవపూర్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్‌ లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొకటి గుజరాత్‌లో ఉంది. ఇక్కడ ప్లాట్‌ ఫారమ్ నుండి బెంచ్ వరకు ప్రతిదానిపై మహారాష్ట్ర, గుజరాత్ అని రాయబడి ఉంటుంది. స్టేషన్‌లో ప్రకటనలు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషల్లో అనౌన్స్ మెంట్స్ చేస్తారు.

అట్టారి రైల్వే స్టేషన్:

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలోని అట్టారి రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్. పంజాబ్ లోని అమృత్‌ సర్‌ లో ఉన్న ఈ స్టేషన్ లోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా వీసా, పాస్ పోర్టు ఉండాలి. గతంలో ఇక్కడి నుంచి భారత్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను కరాచీ వరకు నడిపించేది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా రైలును భారత్ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఈ స్టేషన్‌లో 24 గంటలు భద్రతా బలగాల నిఘాలో ఉంటుంది.

Read Also: దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏకబిగిన ఎన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తాయో తెలుసా?

Related News

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Big Stories

×