EPAPER

VLF Electric Scooter: ఊరు ఇటలీ.. పేరు టెన్నిస్.. భారత మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. వాటికి గట్టి పోటీ..!

VLF Electric Scooter: ఊరు ఇటలీ.. పేరు టెన్నిస్.. భారత మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. వాటికి గట్టి పోటీ..!

VLF Electric Scooter Launch Soon: ప్రస్తుతం భారత దేశంలో ఆటో మొబైల్‌ రంగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. చైనా, జపాన్ వంటి దేశాలు ఈ ఆటోమొబైల్ రంగంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రమంలో వాటిని బీట్ చేసేందుకు ఇప్పుడు భారత్ అంచెలంచెలుగా దూసుకుపోతోంది. ప్రస్తుతం వరల్డ్‌లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.


అంతేకాకుండా విదేశీ ఎలక్ట్రిక్ కంపెనీలు సైతం తమ వాహనాలను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా విదేశీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ టూ వీలర్‌లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. ఇప్పుడు మరొక విదేశీ కంపెనీ తన అదృష్టాన్ని పరీక్షించేందుకు దేశీయ మార్కెట్‌లో ఒక కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అద్భుతమైన ఫీచర్లు, సూపర్ మైలేజీతో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ దేశీయ మార్కెట్‌లో ఒక కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ విఎల్‌ఎఫ్ టూ వీలర్ సిగ్మెంట్‌లో మంచి వాటాను కలిగి ఉంది. ఇది ఒక్క ఇటలీలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా తన హవా చూపిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న భారత మార్కెట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.


Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ EV.. డిజైన్ లీక్.. 2025లో లాంచ్!

ఈ తరుణంలోనే విఎల్ఎఫ్ కంపెనీ.. కా వెలోజ్ మోటార్స్ (KAW Veloce Motors) అనే ప్రైవేట్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగానే కంపెనీ భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన తయారీ కంపెనీనీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఫెసిలిటీ సెంటర్‌ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేయాలని కంపెనీ చూస్తుంది.

ఇటలీలో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో దూసుకుపోతున్న విఎల్ఎఫ్ కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్‌లో ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే కంపెనీ తన కొత్త స్కూటర్‌ను స్టైలిష్‌గా మంచి బిల్డ్ క్వాలిటీతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మైలేజీ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కొత్త స్కూటర్‌ను కంపెనీ ‘టెన్నిస్’ పేరుతో భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఈ స్కూటర్‌ను వచ్చే ఏడాది పండుగ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ భారతదేశం వ్యాప్తంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ని విస్తరించే పనిలో పడింది. చూడాలి మరి ఈ స్కూటర్ లాంచ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

Tags

Related News

Vande Bharat Sleeper Version: వందే భారత్ స్లీపర్ రైలు రెడీ, లగ్జరీ హోటల్ కూడా ఇలా ఉండదేమో.. ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు!

Zomato Hikes : ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో.. దీపావళికి కానుకగా కస్టమర్లకు భారీ షాక్!

Digital Payments: మూడేళ్లలో డిజిటల్ చెల్లింపులు రెట్టింపు, నగదు చెల్లింపుల సంగతేంటి మరి?

Maharaja’s Express Train: ఈ రైలు టికెట్ ఖరీదు అక్షరాలా రూ. 20 లక్షలు.. ఇందులో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న వెండి, పసిడి ధరలు.. తులం ఎంతంటే..

Indian Railway Wool Blanket: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Today Gold Prices: పండగ వేళ భారీ షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Big Stories

×