EPAPER

Akira : మెగా ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. చిరు సినిమాలో అకిరా..?

Akira : మెగా ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. చిరు సినిమాలో అకిరా..?

Akira : మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆఖీరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆరాటపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారసుడుగా స్క్రీన్ మీద అకీరాను ఎప్పుడూ చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవక ముందే ఆఖీరాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా అకీరా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..


పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన వారసుడుగా అకీరా ను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే అకీరాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని.. మ్యూజిక్ అంటే ఇష్టం అంటూ.. ఇప్పటికే రేణు దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించేలా ఆమె గతంలో చాలానే చేసింది. అకీరా విషయంలో రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు వార్ జరుగుతూనే ఉంది. అయితే మెగా అభిమానులు మాత్రం ఆకిరా సినిమాల్లోకి రావాలని, అతని హీరోగా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక త్వరలోనే నేరవేరుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అసలు విషయానికొస్తే.. అకీరా ఓ సినిమాలో నటిస్తున్నాడని సమాచారం.. అయితే హీరోగా మాత్రం కాదు. చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన పార్ట్ షూటింగ్ లో అకీరా పాల్గొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అకీరా ఎంట్రీ గురించి ఓ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది . ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరి అకీరా ఎంట్రీ ఉందో లేదా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. విశ్వంభరా మూవీ పై చిరంజీవి ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత రాబోతున్న విశ్వంభరా మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీతో అయిన చిరు అకౌంట్ లో హిట్ పడుతుందేమో చూడాలి..


Related News

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

Vettaiyan Movie Review : వెట్టయాన్ మూవీ రివ్యూ… రజినీకాంత్‌కి ఇది సరిపోయిందా…?

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

Viswam: సెన్సార్ పూర్తి చేసుకున్న గోపీచంద్ మూవీ.. ఆ సన్నివేశాలు డిలీట్..!

×