BigTV English

Viral News: వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

Viral News: వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

టికెట్ లేని ప్రయాణం నేరం, దొరికితే జరిమానా విధించబడును అనే హెచ్చరికలను బస్సుల్లో, రైళ్లలో చూస్తుంటారు. అయినా, కొంత మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు. ఒక్కోసారి చెకింగ్ సిబ్బందికి దొరికితే ఫైన్ కడతారు. కొన్నిసార్లు దొరకరు. కానీ, టికెట్ లేకుండా విమాన ప్రయాణం చెయ్యొచ్చా? ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టలేం. ఇక విమాన ప్రయాణం చేస్తారా? అంటారు. ఎందుకంటే, విమాన ప్రయాణం చేయాలంటే, పెద్ద కథ ఉంటుంది. పాస్ పోర్ట్ ఉండాలి. వీసా తీసుకోవాలి. విమాన టికెట్లు ఉండాలి. మూడంచెల భద్రతను దాటుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి పత్రాలు లేకుండా విమానం ప్రయాణం చేస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. ఒకసారి పోలీసులకు పడ్డా, తీరు మార్చుకోలేదు. రెండోసారి విమాన ప్రయాణం చేస్తూ పోలీసులకు చిక్కి సంచలనం సృష్టించాడు.


టికెట్ లేకుండా విమాన ప్రయాణం చేసిన నార్వే వ్యక్తి

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మరెవరో కాదు నార్వేకు చెందిన స్కాండినేవియన్. 39 ఏండ్ల ఈ వ్యక్తి జర్మనీలోని రెండో అతిపెద్ద విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ లేకుండా రెండు విమానాలు ఎక్కి భద్రతా సిబ్బందిని షాక్ కి గురి చేశాడు. ఎలాంటి టికెట్ లేకుండా విమానం ఎక్కి భద్రతా సిబ్బందికి పట్టుబడిన, రెండో రోజే  మళ్లీ ఎయిర్ పోర్టు సెక్యూరిటీని బోల్తా కొట్టించి విమానంలో స్వీడన్ కు వెళ్లి సంచలనం సృష్టించాడు.


విమానంలో సీట్లు లేకపోవడంతో బయటపడ్డ భాగోతం

స్కాండినేవియన్ తొలిసారి ఆగస్టు 4న తొలిసారి బవేరియా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బందిని ఈజీగా మోసం చేశాడు.  ప్రయాణీకులు సాధారణంగా తమ బోర్డింగ్ పాసులను ఆటోమేటిక్ గేట్ దగ్గర స్కాన్ చేస్తేనే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, దొంగచాటుగా మరో ప్రయాణీకుడి దగ్గర నిలబడి అతడితో పాటు లోపలికి దూరాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది చెకింగ్ నుంచి కూడా తప్పించుకుని హాంబర్డ్ కు వెళ్లే విమానం ఎక్కాడు. అతడి దురదృష్టం ఏంటంటే.. విమానంలో అన్ని సీట్లు బుక్ అయ్యాయి. అతడికి కూర్చోవడానికి సీటు లేకపోవడంతో బండారం బయటపడింది. వెంటనే విమాన సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. అదే రోజు అతడు విడుదలయ్యాయి.

రెండో రోజే స్టాక్‌ హోమ్‌ విమానం ఎక్కిన స్కాండినేవియన్

పోలీసులకు పట్టుబడ్డ రెండో రోజే స్కాండినేవియన్ మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. టికెట్ లేకుండానే స్టాక్ హోమ్ కు వెళ్లే విమానం ఎక్కాడు. ఈసారి అతడు విమాన ప్రయాణం చేశాడు. అతడి బ్యాడ్ లక్ ఏంటంటే.. విమానం దిగాక భద్రతా సిబ్బందికి చిక్కాడు. అతడి దగ్గర 10 సెంటీ మీటర్ల చిన్న కత్తి ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారిస్తే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం భద్రతా సిబ్బంది అతడిని ప్రశ్నిస్తున్నారు. టైట్ సెక్యూరిటీని దాటుకుని విమానంలోకి ఎలా వెళ్లగలిగాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.  మొత్తానికి విమానంలో టికెట్ లేకుండా ప్రయాణించి స్కాండినేవియన్ సంచలనం సృష్టించాడు.

Read Also: ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్.. చిన్నారి ప్రాణం తీసింది, ఈ తప్పు మీరు చేయొద్దు

Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×