OTT Movie : ప్రస్తుతం థియేటర్లలో ‘దేవర’ సునామి నడుస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాతో తలపడే సాహసం ఎవ్వరు చేయరు. సినిమాలో స్ట్రాంగ్ గా కంటెంట్ ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ బరిలోకి ఒక పాన్ ఇండియా సినిమాతో పాటే రిలీజ్ కావాలంటే గట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ ఉన్నాయి అంటూ ‘దేవర’ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది తమిళ మూవీ ‘సత్యం సుందరం’. కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా అద్భుతంగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూశాక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూసాము అనే ఫీలింగ్ వస్తుందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఈ సినిమాను చూడడం వీలుకాని ప్రేక్షకులు ఓటిటిలో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అడుగు పెడుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ వచ్చేలోపు ఆల్మోస్ట్ ఇలాంటి స్టోరీ తోనే వచ్చిన మరో మలయాళ కామెడీ థ్రిల్లర్ ని సరదాగా చూసేయండి. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో ఉంది? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మలయాళ కామెడీ డ్రామా పేరు ‘అడియోస్ అమిగో’. ఇందులో ప్రముఖ మలయాళ నటులు ఆసిఫ్ అలీ, సూరజ్ వెరంజమూడు హీరోలుగా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 9న మలయాళం లో థియేటర్లలోకి వచ్చింది. అయితే బిగ్ స్క్రీన్ పై ఈ మూవీని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ తాజాగా రిలీజ్ అయిన ‘సత్యం సుందరం’ మూవీకి ఈ మూవీ సిమిలర్ గానే ఉంటుంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కేవలం మలయాళం లోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
సినిమా మొత్తం ఇద్దరు వ్యక్తుల చుట్టే తిరుగుతుంది. ప్రియం అనే వ్యక్తి ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తన తల్లికి ఆపరేషన్ చేయించాల్సి ఉండగా, చేతిలో చిల్లి గవ్వలేక, బోలెడు అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉంటాడు. ఈ క్రమంలోనే ఇతనికి ప్రిన్స్ అనే ఒక రిచ్ పర్సన్ పరిచయం అవుతాడు. ఇద్దరికీ తాగే అలవాటు ఉండటంతో చాలా ఫాస్ట్ గా ఫ్రెండ్స్ అవుతారు. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని వాడుకొని తన తల్లి ఆపరేషన్ కోసం ప్రిన్స్ ని డబ్బులు అడగాలని అనుకుంటాడు ప్రియం. మరి ఈ సినిమాలో ప్రియం ఆ రిచ్ పర్సన్ ని డబ్బు అడిగాడా? చివరికి తల్లిని బ్రతికించుకోగలిగాడా? అనే విషయాలు తెలియాలంటే ‘అడియోస్ అమిగో’ అని ఈ సినిమాను చూసేయండి.