Jio Offer: ప్రతి సంవత్సరం వినియోగదారులను ఆకట్టుకునేలా జియో సరికొత్త ఆఫర్లు తీసుకువస్తుంది. ఈ సారి తన వార్షికోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. మొబైల్ రీచార్జ్ అంటే సాధారణంగా కేవలం డేటా, కాలింగ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ జియో ఇప్పుడు అందిస్తున్న వార్షికోత్సవ వేడుక ప్లాన్. ఇది ఒక రీచార్జ్ మాత్రమే కాదని, వినియోగదారులకు ఒక పండుగ బహుమతని చెప్పొచ్చు.
90 రోజులపాటు డేటా
కేవలం 899 రూపాయలకే ఈ ప్లాన్‌ను అందిస్తుంది జియో. దీని ద్వారా మూడు నెలలపాటు 2జిబి ప్రతిరోజూ డేటాతో పాటు అదనంగా 20జిబి బోనస్ డేటా ఇస్తోంది. అంటే మొత్తం 90 రోజులపాటు డేటా గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ముఖ్యంగా అపరిమిత 5జి అందుబాటులో ఉండటం ఈ ప్లాన్‌లోని పెద్ద విశేషం. హై స్పీడ్ నెట్‌తో సినిమాలు చూడటం, క్లాసులు వినటం, ఆఫీస్ పనులు పూర్తిచేయటం, గేమ్స్ ఆడటం అన్ని అనుభవం అవుతుంది.
రెండు నెలలపాటు జియోహోమ్ ట్రయల్
ఇకపోతే ఈ ఆఫర్‌లో మరో ప్రత్యేకత ఉంది. రీచార్జ్ చేసిన వారికి రెండు నెలలపాటు జియోహోమ్ ట్రయల్ ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా జియో గోల్డ్‌పై అదనంగా 2 శాతం ప్రయోజనం లభిస్తుంది. ఇది ఒక్క రీచార్జ్‌కి తోడు మరింత విలువ చేకూర్చే ఆఫర్‌గా మారింది.
Also Read: Samsung Galaxy: టెక్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న లీక్స్.. ఫీచర్లు షాక్!
ప్రత్యేక ఆఫర్లు ఆల్ ఇన్ వన్ ప్యాక్
అదే కాకుండా వినియోగదారులకు రూ.3000 విలువైన అదనపు బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగమవుతాయి. జియోసినిమా, జియోసావ్న్ ప్రీమియం ద్వారా వినోదం, జొమాటో గోల్డ్ ద్వారా ఫుడ్ ఆఫర్లు, ఎజియో ద్వారా ఫ్యాషన్ షాపింగ్ తగ్గింపులు, ఈజ్‌మైట్రిప్ ద్వారా ప్రయాణ సౌకర్యాల్లో డిస్కౌంట్లు, నెట్‌మెడ్స్ ద్వారా మెడిసిన్ కొనుగోలులో లాభాలు, రిలయన్స్ డిజిటల్‌లో గాడ్జెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఆల్ ఇన్ వన్ ప్యాక్‌గా వినియోగదారులకు అందుతున్నాయి.
డేటా మాత్రమే కాదు, వినోదం కూడా
మరింత ఆకర్షణ ఏమిటంటే, ఈ రీచార్జ్‌ను అమెజాన్‌లో చేస్తే అదనంగా 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంటే కేవలం 899 రీచార్జ్ చేస్తే, డేటా మాత్రమే కాదు, వినోదం, షాపింగ్, ట్రావెల్, హెల్త్ అన్నీ ప్యాకేజీ మీ చేతుల్లోకి వస్తుంది.
5జీ స్పీడ్‌తో పాటు వెయ్యి రూపాయల ఆఫర్!
జియో ఎప్పుడూ వినియోగదారుల అంచనాలను మించి సర్వీసులు అందిస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఈ వార్షికోత్సవ ఆఫర్ అదే తరహా సంచలనంగా నిలిచింది. తక్కువ ఖర్చులో ఎక్కువ సౌకర్యాలు, నాణ్యమైన నెట్ స్పీడ్, అదనపు ఆఫర్లు అన్నీ కలిపి జియో ఈ ప్లాన్‌ను నిజంగా ప్రత్యేకంగా మార్చాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే అమెజాన్‌లో రీచార్జ్ చేసి, వచ్చే మూడు నెలలపాటు అపరిమిత 5జీ స్పీడ్‌తో పాటు వెయ్యి రూపాయల విలువైన అదనపు సౌకర్యాలను ఆనందించండి.