Gold Rate Dropped:శుభకార్యాలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఆడవారికి బంగారం అంటే మహా ఇష్టం. ఏ శుభకార్యానికి వెళ్లిన బంగారం ధరించాల్సిందే.. తగ్గేదేలే.. అన్నట్టుగా ఉంటారు మహిళలు.. కానీ ప్రస్తుత కాలంలో బంగారం భారీగా పెరిగిపోతుంది. బంగారం కొనాలంటేనే పసిడి ప్రియులు బయపడేవిధంగా మారుతుంది. అయితే గత పది రోజులుగా భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
శనివారం బంగారం ధరలు ఇలా..
శనివారం రోజు ప్రస్తుత బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే.. శుక్రవారం రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,280 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,170 వద్ద కొనసాగుతుంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,000 ఉండగా.. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,900 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజు 10 గ్రాముల బంగారం పై రూ.110 తగ్గిందని చెబుతున్నారు.
ఇలాగే కొద్ది కొద్దిగా తగ్గిన బంగారం ధరలు పసిడి ప్రియులు కాస్త ఊపిరి పిల్చుకుంటారు. అయితే బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అని పసిడి ప్రియులు ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ బంగారం పెరిగే ఛాన్స్..
ఈ మధ్య కాలంలో ట్రంప్ పెంచిన టారిఫ్ ప్రభావం, నేపాల్ లో జరిగిన గొడవలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి వాటి వల్ల షేర్ మార్కెట్లో పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. దీంతో బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే బంగారం ఇంకా పెరిగే అవకాశం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావున బంగారం కొనాలనుకునే వారు డబ్బులు ఉంటే ఇప్పుడే కొనండని చెబుతున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,11,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,900 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,900 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,900 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,300ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,050 వద్ద పలుకుతోంది.
Also Read: వైసీపీలో తీవ్ర విషాదం.. వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి..
నేటి సిల్వర్ ధరలు..
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతుంటే సిల్వర్ ధరలు మాత్రం పెరుగుతుపోతున్నాయి. శుక్రవారం హైదరబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1,42,000 కాగా శనివారం కేజీ సిల్వర్ ధర రూ.1,43,000 ఉంది. అంటే కేజీపై ఒక్కరోజులో రూ.1,000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.1,33,000 వద్ద పలుకుతోంది.