BigTV English

IAS Smita Subraval: చర్యలు తీసుకోవద్దు!! హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

IAS Smita Subraval: చర్యలు తీసుకోవద్దు!! హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

IAS Smita Subraval: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‌కు.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకునే చర్యలను వాయిదా వేస్తూ, హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి పరిశీలన చేయించిందని తెలిసిందే. కమిషన్ దరఖాస్తు ప్రకారం, సమగ్ర విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలో IAS స్మితా సబర్వాల్‌పై కొన్ని వ్యాఖ్యలు, చర్యల వివరాలు చేర్చబడ్డాయి.

తదుపరి క్రమంలో స్మితా సబర్వాల్ తనపై ఉన్న అభియోగాలను తొలగించేందుకు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రధానంగా, కమిషన్ నివేదికలో తన పేరు తొలగించాల్సిందని, తన వివరణ అడగడానికి 8B, 8C నోటీసులు ఇవ్వకపోవడం లాంటి అంశాలను పేర్కొన్నారు.


పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశాలు

కమిషన్ నివేదిక ప్రకారం, IAS స్మితా సబర్వాల్ కాలేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కొన్ని జిల్లాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సేకరించి అప్పటి ముఖ్యమంత్రి వద్దకు సమర్పించడం, అవసరమైతే నిర్మాణ విధానాల్లో మార్పులు సూచించడం.. ఆమె భర్తీ చేసిన విధానంలో భాగమని కమిషన్ తెలిపింది.

కమిషన్ నివేదికలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ పలు సందర్భాల్లో మూడు బ్యారేజీలను ప్రత్యక్షంగా సందర్శించిన అంశం కూడా ప్రస్తావించబడింది.

అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు, చర్యలు

పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో, IAS స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో.. కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. ఇది ప్రాజెక్ట్ వేగవంతమైన నిర్మాణానికి దోహదపడిన అంశంగా ఉన్నప్పటికీ, వివిధ వర్గాల నుండి ఈ చర్యపై విమర్శలు వచ్చాయి.

కమిషన్ చివరగా స్మితా సబర్వాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ ముందుంచాలని సూచించింది. అయితే IAS స్మితా సబర్వాల్ దీనిపై వివరణ ఇవ్వడానికి సరైన నోటీసులు అందించబడలేదని హైకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పు- ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ విచారణలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసి, మరింత సమగ్ర పరిశీలనకు అవకాశం కల్పించింది. ఈ తీర్పు IAS స్మితా సబర్వాల్ కు తాత్కాలికంగా ఊరటను కలిగించింది.

Also Read: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Related News

Srushti Hospital: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

CBI ON Kaleshwaram: సీబీఐ దిగేసింది.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ

Indigo Flight: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. గాల్లో ఉండగా

Hyderabad News: తెలుగు తల్లి కాదు.. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, పేరు మార్చిన జీహెచ్ఎంసీ

Group-1 Result: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-10 అభ్యర్థులు, వారికే ఆర్డీవో పోస్టులు

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Big Stories

×