BigTV English

Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

Nagarjuna: సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో ఒకరి తర్వాత మరొకరు తమ వ్యక్తిగత పరువును కాపాడుకోవడానికి ధర్మాసనాన్ని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలి అంటూ.. బహిరంగ ప్రదేశాలలో అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నారని.. తమ ఫోటోలను ఉపయోగించి అశ్లీల కంటెంట్ ను కూడా క్రియేట్ చేస్తున్నారు అంటూ తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు. అంతేకాదు వెంటనే తమకు పరిష్కారం కావాలి అని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అభిషేక్ బచ్చన్ (Abhishek bacchan), ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), అనిల్ కపూర్(Anil Kapoor) తో పాటు కరణ్ జోహార్ (Karan Johar) వంటి సెలబ్రిటీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇక పిటిషన్ విచారించిన ధర్మాసనం సెలబ్రిటీల అనుమతులు లేకుండా వారి ఫోటోలను వీడియోలను ఉపయోగించుకోకూడదు అని, అలా చేస్తే జరిమానాతో పాటు కఠిన శిక్ష కూడా పడుతుంది అంటూ తీర్పునిచ్చింది.


ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున..

అయితే ఇప్పుడు వీరి బాటలో టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna ) కూడా నడుస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఆయన న్యాయం చేయండి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా తన పేరును కానీ, తన ఫోటోను కానీ ఎవరు వాడకుండా నిషేధం విధించాలి అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నాగార్జున పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టిస్ తేజస్ కారియా పరిశీలిస్తున్నారు. త్వరలోనే తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల ఫోటోలను వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి సెలబ్రిటీలు ఇలా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవలే నాంపల్లి కోర్టుకు వెళ్లిన నాగార్జున..


ఇదిలా ఉండగా ఈనెల మూడవ తేదీన హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకి నాగార్జున తన తనయుడు నాగచైతన్య (Naga Chaitanya) తో కలిసి హాజరైన విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టుకు హాజరైన వీరు న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. తాము వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. అలాగే న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతోందని కూడా స్పష్టం చేశారు.

పరువు నష్టం కేసులో..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారిక కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ లోని కొంత భాగాన్ని కూడా కూల్చివేశారు. అయితే ఈ విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందుకే పరువు నష్టం కేసులో అప్పుడే కోర్టును ఆశ్రయించారు నాగార్జున. మరి నాంపల్లి కోర్టు తుది తీర్పు ఏ విధంగా ఇస్తుందో చూడాలి అని అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగార్జున వందవ సినిమాపై అభిమానుల ఆశలు..

నాగార్జున 100వ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు . ముఖ్యంగా ఈయన తోటి హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తుంటే.. మరొకవైపు ఈయన మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగర్జున 100వ సినిమాకు సంబంధించిన ప్రకటన దసరా సందర్భంగా వెలువడనుందని సమాచారం.

also read:OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

Related News

OG Movie: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పవన్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడా ..?

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

OG Collections: ఓజీ డిస్ట్రక్షన్… ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 160 కోట్లు

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?

Big Stories

×