BigTV English

Jio Cheapest Recharge Plan: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

Jio Cheapest Recharge Plan: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

Jio Cheapest Recharge Plan: ఇటీవల టెలికాం కంపెనీలు అన్ని తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచాయి. దీంతో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి. దీని కారణంగా సామాన్య ప్రజల జేబులపై భారీగా భారం పడుతోంది. అయితే ఈ ఖర్చును తగ్గించేందుకు కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు ఇంకా ఉన్నాయి. అటువంటి బడ్జెట్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.


ఈ రోజు ఫుల్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించే తక్కువ ధరలో కొన్ని కాంప్లిమెంటరీ ప్రయోజనాలను అందించే ప్లాన్ గురించి చూద్దాం. ఈ ప్లాన్‌లో మీరు బడ్జెట్ ధరలో బండిల్ డేటాను పొందుతారు. ఇది కాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, అనేక ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ అతిపెద్ద బెనిఫిట్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Also Read: వామ్మో వామ్మో.. చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్..!


జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లో చేర్చబడిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 355 రీఛార్జ్‌తో వస్తుంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్లాన్‌ను యాక్టివేట్ చేయవచ్చు లేదా మొబైల్ యాప్‌లు ఇతర వాలెట్ల ద్వారా కూడా యాక్టివేట్ చేయవచ్చు. ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారు 25GB హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను పొందుతాడు. మీరు అవసరాలకు అనుగుణంగా డేటాను యూజ్ చేయవచ్చు. ఇందులో డైలీ లిమిట్ లేదు. బండిల్ కోటా అయిపోయిన తర్వాత కూడా, ఇంటర్నెట్ 64kbps వేగంతో వస్తుంది. మీరు 24×7 ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.

ఇది జియో అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్. దీనితో మీరు మీ సన్నిహితులతో టైమ్‌తో సంబంధం లేకుండా  మాట్లాడవచ్చు. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100SMS ఉచితంగా అందిస్తుంది. ప్లాన్ అదనపు ప్రయోజనాలుగా, వినియోగదారు JioTV, JioCinema, JioCloud వంటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు.

Also Read: బెస్ట్ సెల్లింగ్ SUVగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌.. ఊహించని డిస్కౌంట్లు..!

JioTV యాప్ ద్వారా మీరు 30 రోజుల పాటు వివిధ రకాల టీవీ షోలను ఉచితంగా చూడొచ్చు. ఇది కాకుండా మీరు సినిమాలను చూడటం ఇష్టం ఉన్నట్లయితే మీరు ఈ ప్యాక్‌తో JioCinema సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. ఇది 30 రోజుల వాలిడిటీతో ఉంటుంది. మీరు మీ ఫోన్‌లో స్టోరేజ్ కోసం JioCloud యాప్‌ని ఉపయోగించవచ్చు. ప్లాన్ గురించి మరింత సమాచారం కోసం మీరు Jio అఫిషియల్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×