BigTV English
Advertisement

Breaking News: యూఎస్​ ప్రతిపాదనల మేరకు బందీల రిలీజ్‌కు రెడీ, కానీ..!

Breaking News: యూఎస్​ ప్రతిపాదనల మేరకు బందీల రిలీజ్‌కు రెడీ, కానీ..!

Hamas Agrees To Us Proposal To Initiate Negotiations On Releasing Israel Hostages: గత తొమ్మిది నెలలుగా హమాస్​, ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా అమెరికా ప్రతిపాదించిన విడతలవారీ కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలనే షరతులను ఉపసంహరించుకున్న హమాస్‌, ఈ ఒప్పందానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరింది. అయితే ఈ ఒప్పందానికి ఇప్పటివరకు ఎలాంటి హామీ ఒప్పందం లేదని ఆయా వర్గాలు వెల్లడించాయి. అమెరికా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొలుత 6 వారాలపాటు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఈ టైమ్‌లో కొందరు ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేయాలి. కానీ అందుకు బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. నెలన్నర రోజుల్లో గాజాలోని జనసమర్థ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్ సైనికులు వైదొలుగుతారు. అక్కడి ప్రజలు తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చేందుకు సపోర్ట్‌ చేస్తారు. ఇక రెండో విడతలో హమాస్ వద్ద ఉన్న బందీలను రిలీజ్ చేయాలి. కానీ అందుకు బదులుగా ఇజ్రాయెల్ మరికొంతమంది ఖైదీలను రిలీజ్ చేస్తుంది. మూడో విడతలో ఇజ్రాయెల్‌​కు చెందిన మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంది.


ఒకవేళ బందీల్లో ఎవరైనా మృతిచెందినట్లయితే, వారి డెడ్‌బాడీస్‌ని తమకు అప్పగించాలి. అమెరికా ప్రతిపాదించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన హమాస్, కచ్చితంగా దీనికి లిఖితపూర్వక హామీ కావాలని క్లారిటీ ఇచ్చింది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య గొడవలకు మూలకారణం తూర్పు జెరూసలెంలోని అల్‌ అఖ్సా ప్రధాన కేంద్రంగా నడుస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా మైనార్టీలు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్‌ అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్‌-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. అందులో బైబిల్‌ ప్రకారం కింగ్‌ సాలమన్ నిర్మించింది. ఆ తర్వాత బాబిలోనియన్స్‌ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లయిన తర్వాత తొలి శతాబ్దిలో రోమన్‌ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్‌ ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ నుంచి ఇజ్రాయోల్‌ సొంతం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించటానికి 34 ఏళ్ల క్రితం కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా, గొడవలు తీవ్రమయ్యాయి.

Also Read: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి


26 ఏళ్ల క్రితం జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్‌ అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాని నిర్ణయించారు. ఇక్కడ శాంతియుతంగా ప్రార్థనలను చేసుకునేందుకు ముస్లింలకు అనుమతించినట్లుగా, యూదులు, క్రైస్తవుల వంటి కులాలకు ఫర్మీషన్ ఉండదు. ఎందుకంటే వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అల్‌ అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు ఇచ్చే అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక యూదు మతసంస్థలు తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్‌ అఖ్సా ఏరియాలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత ఇజ్రాయెల్ భద్రతాదళాల సాయంతో యూదు అతివాదులు భారీసంఖ్యలో ఆ ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురై 2023 అక్టోబర్​ 7న హమాస్ దాడులు చేసిన తరువాత, ఇజ్రాయెల్​ హమాస్​ మధ్య వివాదం తీవ్రతరమైంది. దీంతో ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా అమెరికా చేసిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి వీరి యుద్ధానికి పుల్‌స్టాప్ పడితే మిగతా దేశాలు సైతం శాంతియుతంగా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని ప్రపంచ దేశాలన్ని కోరుకుంటున్నాయి.

Tags

Related News

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

Big Stories

×