Jio Mart- D-Mart Prices: తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులను అందించే ఏ సంస్థకైనా వినియోగదాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోజువారీ సరుకులను సరసమైన ధరల్లో అందించడంలో డి-మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ (జియోమార్ట్) ముందుంటున్నాయి. ఈ రెండింటిలో ప్రజలకు అత్యవసరాలైన కిరాణా సామాన్ల నుంచి గృహోపకరణాల వరకు లభిస్తాయి. వీటిలోకి అడుగు పెడితే ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తులను కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇక్కడ లేవు అనే మాట వినిపించదు. అందుకే, చాలా మంది ఈ రెండు స్టోర్లలో వస్తువులను కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. అయితే, ఈ రెండింటిలో ధరలు మరింత తక్కువగా ఎందులో లభిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రిలయన్స్ మార్ట్- డి-మార్ట్ దేనిలో ధరలు తక్కువ?
జియో మార్ట్ తో పోల్చితే డి-మార్ట్ లో తక్కువగా ఉంటాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ డి-మార్ట్ బిజినెస్ మోడల్: డి-మార్ట్ నేరుగా ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తంలో సరుకులను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల ఖర్చులు ఉండవు. ఈ సంస్థ తక్కువ ఇన్వెంటరీ నిల్వ సమయంతో పాటు ప్రకటనలకు తక్కువ ఖర్చు చేస్తారు. యాడ్స్ లేకుండా బిజినెస్ చేయడం వల్ల తక్కువ ధరలకే వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించే అవకాశం ఉంటుంది.
⦿ డిస్కౌంట్లు- ఆఫర్లు: డి-మార్ట్ లో కిరాణా సామాన్లు, గృహోపకరణాలు, స్టేషనరీ, డైరీ ఉత్పత్తులపై కనీసం 7% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు, 5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ కొనుగోలు చేస్తే ఒక లీటర్ ఆయిల్ ఉచితం లాంటి ఆఫర్లు అందిస్తుంది.
⦿ రిలయన్స్ ఫ్రెష్/జియో మార్ట్: రిలయన్స్ ఫ్రెష్ కూడా పోటీ ధరలను అందిస్తుంది. కానీ, వారి బిజినెస్ మోడల్ ఆన్ లైన్, ఆఫ్ లైన్.. రెండింటిపై దృష్టి సారిస్తుంది. జియో మార్ట్ హోమ్ డెలివరీ, ఆన్ లైన్ ఆర్డర్లపై ఎక్కువ ఆఫర్లు అందిస్తుంది. కానీ, డి-మార్ట్ తో పోలిస్తే ధరలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆఫ్ లైన్ స్టోర్లలో ధరలు అధికంగానే ఉంటాయి.
⦿ స్థానిక దుకాణాలో పోల్చితే?: వినియోగదారులు చాలా మంది డి-మార్ట్ లో వస్తువుల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు స్థానిక షాపులతో పోలిస్తే డి-మార్ట్ లో చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే, ధరలు అనేవి ఆయా నగరాలు, ఉత్పత్తుల రకం మీద ఆధారపడి ఉంటుంది.
⦿ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే?: చాలా సందర్భాలలో డి-మార్ట్ కిరాణా సామాన్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులపై తక్కువ ధరలను అందిస్తుంది. ముఖ్యంగా ఆఫ్ లైన్ కొనుగోళ్లలో తక్కువ ధరలు ఉంటాయి. జియోమార్ట్ ఆన్ లైన్ ఆర్డర్లలో డిస్కౌంట్లు, హోమ్ డెలివరీ తో పోటీ పడుతుంది. కచ్చితమైన పోలిక కోసం, మీకు దగ్గర లోని డి-మార్ట్, జియోమార్ట్ స్టోర్ లలో నిర్దిష్ట ఉత్పత్తుల ధరలను సరిపోల్చడం మంచిది.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?