Ghaati Trailer : ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించింది కానీ ఒకప్పుడు అనుష్క వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించేవాళ్ళు. ఇప్పటికీ కూడా అనుష్కకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం అందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
ఒక తరుణంలో అనుష్క లేడీ ఒరింతేడ్ సినిమాలు చేయటం మొదలుపెట్టారు. అనుష్క కెరియర్ లో అరుంధతి సినిమా నెక్స్ట్ లెవెల్. అరుంధతి సినిమాతో విపరీతమైన గుర్తింపు అనుష్కకు లభించింది. స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది అనుష్క. ఇక ప్రస్తుతం అనుష్క క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే సినిమాను చేస్తుంది.
ఘాటీ ట్రైలర్ అప్డేట్
హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. అప్పుడు వైష్ణవ తేజ్ హీరోగా కొండ పొలం అనే సినిమాను చేశాడు క్రిష్ జాగర్లమూడి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. కొన్ని కారణాల వలన హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నారు. అప్పుడు అనుష్క హీరోయిన్ గా ఘాటి అనే సినిమాను చేశాడు. ఈ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా చిత్ర యూనిట్ రేపు అనౌన్స్ చేస్తారు. ఇదివరకే సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. క్రిష్ అనుష్క ని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్. చాలా వైలెంట్ గా ఈ సినిమాలో అనుష్క కనిపిస్తున్నారు.
వేదం తర్వాత మరోసారి
గమ్యం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు క్రిష్ జాగర్లమూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వేదం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మొదటిసారి అనుష్క వేశ్యపాత్రలో కనిపించింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాతో ఒక కొత్త అనుష్కను వెండి తెరపై ఆవిష్కరించాడు. ఇక ప్రస్తుతం గాటి సినిమాతో ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. క్రిష్ ఈ సినిమా ఏ స్థాయిలో తీశాడో రేపు ట్రైలర్ తో ఒక అవగాహన రాబోతుంది.
So looking forward to share this story /journey with all of you …thank you for ur love …..
Always forever 🧿🧚♀️🫠🥰😍🫠#GhaatiTrailer and release date announcement on August 6th at 4.35 PM 💥
Stay tuned! And wish us the very best ….🫠#GHAATI @MsAnushkaShetty &… pic.twitter.com/rkZtXOUU9k— Anushka Shetty (@MsAnushkaShetty) August 5, 2025