Jio Offers: మన రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఫోన్ లో మెసేజులు పంపడం, వీడియో కాల్స్ చేయడం, సినిమాలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేయడం ప్రతి పనికి మనం డేటాపైనే ఆధారపడుతున్నాం. దీనిని దృష్టిలో ఉంచుకుని టెలికాం కంపెనీలు కూడా కొత్త కొత్త ఆఫర్లు తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ప్రత్యేక ఆఫర్‌ను ఇప్పుడు జియో తీసుకువచ్చింది.
జియో నుండి ఒక అద్భుతమైన 5జీ అడ్డాన్ ఆఫర్ లభిస్తోంది. కేవలం 51 రూపాయలకే అన్‌లిమిటెడ్ 5జీ డేటా స్పీడ్‌తో ఇంటర్నెట్ లభించబోతుంది. ఇది వినియోగదారులకు నిజంగా షాకింగ్ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా మనం డేటా ప్యాక్‌లు రీచార్జ్ చేసినప్పుడు దీనిని పరిమిత జీబీ డేటా ఇస్తారు. కానీ ఇందులో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం డేటా ప్యాక్‌లు రీచార్జ్ చేసినప్పుడు తక్కువ జీబీ డేటా ఇస్తారు. కానీ జియో ఇచ్చిన ఈ ఆఫర్ పరిస్థితి వేరుగా ఉంటుంది.
ఈ ఆఫర్‌లో ప్రత్యేకత ఏమిటంటే..
జియో అన్‌టిమిటెడ్ 5G వినియోగం. అంటే మీరు 5G నెట్‌వర్క్ పరిధిలో ఉంటే, స్పీడ్ గురించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇందులో అదనంగా 3జీబీ హై స్పీడ్ డేటా కూడా మనకు ఇవ్వనుంది. అంతేకాదు ఆ 3జీబీ డేటా పూర్తయిన తర్వాత కూడా, యాక్టివ్ ప్లాన్ వాలిడిటీ వరకు కనెక్షన్ కొనసాగుతుంది. అంటే మీరు రీచార్జ్ చేసుకున్న ప్లాన్ ఉన్నంతకాలం ఈ అడ్డాన్ ఆఫర్ ఉంటుంది.
Also Read: Bollywood: కీలక పదవి అందుకున్న ప్రభాస్ బ్యూటీ..ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్!
జియో వినియోగదారులకు ఈ ఆఫర్ మంచిగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఎక్కువగా వీడియోలు చూసే వారు, ఆన్‌లైన్ క్లాసులు హాజరయ్యే విద్యార్థులు, గేమింగ్ ప్రేమికులందరికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 5జీ నెట్‌వర్క్‌లో స్పీడ్ అంటేనే ఆ లెవన్ వేరేగా ఉంటుంది. క్షణాల్లో డౌన్‌లోడ్‌లు, సెకన్లలో అప్లోడ్‌లు అవుతాయి. దీనివల్ల మనకు ఎటువంటి ఆటంకంలేకుండా క్షణాల్లో పనులు జరుగుతాయి.
ఫాస్ట్ స్పీడ్‌ని ఫీల్ అవ్వండి, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయి ఉండండి అనే కాన్సెప్ట్‌తో ఈ ప్లాన్‌ను జియో వినియోగదారుల కోసం అందిస్తోంది. దీనిని రీచార్జ్ చేయడమూ చాలా సులభం. మై జియో యాప్‌లో కానీ, ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌లో కానీ కేవలం కొన్ని క్లిక్స్‌లోనే రూ.51 రీచార్జ్ చేసుకోవచ్చు.
టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో మనకు స్పీడ్ ఇంటర్నెట్ వాడకం కూడా మరింతగా పెరుగుతుంది. 4జీ టెక్నాలజీతో మనం వాడుతున్న ఇంటర్నెట్ స్పీడ్ కంటే 5జీ టెక్నాలజీ స్పీడ్ దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వేగాన్ని కేవలం రూ.51కే వినియోగదారులకు ఇవ్వడం ఒక గొప్ప అవకాశమే అని చెప్పాలి. మీరు జియో కస్టమర్ అయితే, వెంటనే ఈ రూ.51 జియో 5జీ అడ్డాన్ ఆఫర్‌ను తప్పకుండా ప్రయత్నించండి. ఇది మీ రోజువారీ ఇంటర్నెట్ అవసరాలకు సరైన సపోర్ట్ ఇస్తుంది.