Viral News: అప్పుడప్పుడు వైద్యశాస్త్రంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. బతకడం కష్టం అని చెప్పిన వ్యక్తులు బతకం, చనిపోయాడు అని భావించిన వ్యక్తులు లేచి నిలబడటం అరుదుగా చూస్తుంటాం. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఊహించని ఇన్సిడెంట్ తో అందరూ షాకయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అంత్యక్రియలకు ముందు లేచిన వ్యక్తి
వనపర్తికి చెందిన తైలం రమేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కార్యకర్త. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పాల్గొంటాడు. అంతేకాదు, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అంటే ఎంతో అభిమానం. ఆయన ఫోటోను తన గుండెపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. పార్టీ అన్నా, నిజరంజన్ రెడ్డి అన్నా ఎంతో ఇష్టపడే ఆయన, నిన్న(సెప్టెంబర్ 1న) ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. అందరూ అతడు గుండెపోటుతో చనిపోయారని భావించారు. బోరుబోరున విలపించారు. బంధుమిత్రులకు సమాచారం అందించారు. అందరూ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
అభిమాన నాయకుడు నిరంజన్ రెడ్డి రావడంతో..
తైలం రమేష్ చనిపోయాడనే విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీని, తనను ఎంతో ఇష్టపడే కార్యకర్తలు ఉన్నట్టుండి చనిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. వెంటనే రమేష్ ను చూసేందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులు నిరంజన్ రెడ్డిని చూసి కంటతడి పెట్టుకున్నారు. రమేష్ కు నిరంజన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టం అని, గుండె మీద పచ్చబొట్టుకూడా వేయించుకున్నాడని, కుటుంబ సభ్యులు చూపించారు. నిరంజన్ రెడ్డి ఆయన పచ్చబొట్టును చూస్తుండగా, రమేష్ కదిలినట్లు అనిపించింది. వెంటనే నిరంజనర్ రెడ్డి.. రమేష్ అని పిలువగానే ఇంకాస్త కదిలాడు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు అతడిని పరిశీలించి బతికే ఉన్నట్లు చెప్పారు.
Read Also: డబుల్ మర్డర్.. భార్య, అత్తను కత్తెరతో హత్య చేసిన అల్లుడు!
ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు
ఈ విషయం ఊళ్లో వాళ్లకు తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్.. నిరంజన్ రెడ్డి పిలిస్తే చావు నుంచి లేచి వచ్చాడంటున్నారు. మొత్తానికి చనిపోయాడనుకున్న రమేష్ బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. అటు రమేష్ కు మెరుగైన చికిత్స అందించాలని నిరంజన్ రెడ్డి డాక్టర్లకు సూచించారు.
Read Also: వీధి కుక్కలే పెళ్లి అతిథులు, నెట్టింట వీడియో వైరల్!