BigTV English

Bollywood: కీలక పదవి అందుకున్న ప్రభాస్ బ్యూటీ..ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్!

Bollywood: కీలక పదవి అందుకున్న ప్రభాస్ బ్యూటీ..ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్!

Bollywood:కృతి సనన్ (Kriti Sanan) .. మోడల్ గా కెరియర్ ను ఆరంభించి.. ఆ తర్వాత ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్ యాడ్స్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. మొదటిసారి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) నటించిన ‘1-నేనొక్కడినే’ అనే సినిమా ద్వారా నటిగా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. అటు హిందీలో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)హీరోగా నటించిన ‘హీరో పంతి’ సినిమాతో హిందీలో కూడా అడుగు పెట్టింది. అలాగే ప్రభాస్(Prabhas ) హీరోగా నటించిన ‘ఆది పురుష్’ సినిమాలో నటించి ఘోర డిజాస్టర్ ను చవిచూసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన కృతి సనన్ మరో ఘనత అందుకున్నారు.


కీలక పదవి అందుకున్న కృతి సనన్..

‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్’ (UNFPA) ఇండియా హానరరీ అంబాసిడర్ ఆఫ్ ఈక్వాలిటీగా బాలీవుడ్ నటి కృతి సనన్ నియమితులయ్యారు. అంటే “ఇండియాకి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా” ఈమెను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ పై అలాగే సినీ ఇండస్ట్రీలో నటీనటులపై, లింగ వివక్షపై ఊహించని కామెంట్లు చేశారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ లపై ఇండస్ట్రీలో చూపిస్తున్న భేదం గురించి కూడా ఆమె మాట్లాడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


ఇండస్ట్రీలో లింగ వివక్షపై కృతి సనన్ కామెంట్స్..

అసలు విషయంలోకి వెళ్తే కృతి సనం మాట్లాడుతూ.. “రెమ్యూనరేషన్, సౌకర్యాల విషయం అటు ఉంచితే.. సినీ పరిశ్రమలో నటీనటులను గౌరవించడంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు. ముఖ్యంగా హీరోలకు పెద్ద పెద్ద కార్లు, విలాసవంతమైన గదులను కేటాయిస్తారు.. అయితే హీరోయిన్లకు మాత్రం ఇవేవీ ఉండవు. నిజానికి ఇది కనిపించే వారికి చాలా చిన్న విషయమే అయినా.. అలా ఎందుకు చేస్తారని నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. ముఖ్యంగా కార్లు, సౌకర్యాల గురించే కాదు మహిళలను తక్కువ చేసి చూడడం గురించి నేను ప్రధానంగా మాట్లాడుతున్నాను. మగవారితో పాటు ఆడవారు కూడా సమాన హక్కును కలిగి ఉంటారు. అందుకే హీరోలతో సమానమైన గౌరవాన్ని అందుకోవడానికి మేము కూడా అర్హులమేనని ఈ సందర్భంగా చెబుతున్నాను.

షూటింగ్ సమయంలో కూడా ఇదే జరుగుతోంది..

ముఖ్యంగా షూటింగ్ సమయంలో కూడా ఇలాగే జరుగుతుంది.. హీరోయిన్లు మాత్రం అనుకున్న టైం కంటే ముందే వెళ్లి హీరోల కోసం ఎదురు చూడాలి. కానీ హీరోలు మాత్రం సెట్స్ కి ఆలస్యంగా వస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఎన్నోసార్లు నన్ను ముందే సెట్ కి రావాలని పిలిచేవారు. హీరోలకు మాత్రం వారు ఎప్పుడూ అలా చెప్పలేదు. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా పోటీపడి మరీ నటిస్తున్నారు కదా.. ఇలాంటి సమయంలో ఎందుకు ఆడవారికి గౌరవం కల్పించడం లేదు. ఇలాంటి ఆలోచన విధానంలో కచ్చితంగా మార్పు రావాలి” అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మార్పు అక్కడి నుండే మొదలవ్వాలి – కృతి సనన్

అలాగే తన తల్లి గురించి, తాను ఈ స్థాయిలో నిలబడడానికి గల కారణం గురించి కృతి సనన్ మాట్లాడుతూ..” మా అమ్మ పెరిగిన వాతావరణంలో ఎక్కువగా పురుషులను గౌరవించేవారు. మహిళలు అంటే.. వంటగదికే పరిమితమయ్యేవారు. మా అమ్మకి చదువుకోవాలని, డాన్స్ చేయాలని, ఈత కొట్టాలని ఇలా ఎన్నో కలలు ఉండేవట. కానీ అవేవీ ఆమె నెరవేర్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఆమె ప్రొఫెసర్.. ఆమె పోరాట స్ఫూర్తితోనే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మాకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పూర్తి స్వేచ్చని ఇచ్చింది. మార్పు అనేది ఇంట్లో నుంచి మొదలైతే సమాజం కూడా బాగుపడుతుంది” అంటూ తన అభిప్రాయంగా తెలిపింది.

ALSO READ:Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన

 

?utm_source=ig_web_copy_link

Related News

Kishkindapuri: తూచ్ మా సినిమా వాయిదా లేదు… మిరాయ్ కు పోటీగానే

Srinidhi Shetty: వెంకీ మామకు జోడిగా కేజిఎఫ్ బ్యూటీ…మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్టే!

shraddha das: తీన్మార్ స్టెప్పులతో పబ్లిక్ లో అదరగొట్టేసిన శ్రద్ధాదాస్.. వీడియో వైరల్!

Sundarakanda Collections : సుందరకాండ మూవీకి 5.5 కోట్ల నష్టం… పాపం నారా రోహిత్ !

OG Movie : ఓజీకి జీరో బజ్.. పవన్ మళ్లీ వీరమల్లు గెటప్ వేయ్యాలేమో?

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

Big Stories

×