BigTV English

Allu Aravind: కొడుకు కోసం అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. స్టార్ డైరెక్టర్స్ ను వదిలి.. అతనితో మళ్లీ ..?

Allu Aravind: కొడుకు కోసం అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. స్టార్ డైరెక్టర్స్ ను వదిలి.. అతనితో మళ్లీ ..?
Advertisement

Allu Aravind: కొడుకును పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని నిర్మాత అల్లు అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. ఇక పుష్ప 2 తో గ్లోబల్ స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే బన్నీ సినిమాలను ఏరికోరి ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే బన్నీ.. త్రివిక్రమ్ సినిమాను కూడా పక్కనపెట్టి మరీ అట్లీ సినిమాను లైన్లో పెట్టాడు.


ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించాడు అట్లీ. ఇక హీరోయిన్లను అయితే దాదాపు ముగ్గురు, నలుగురు ఉన్నారు. అయితే అట్లీ సినిమా తరువాత బన్నీ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో బన్నీ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది ఎవరికీ తెలియని విషయం. ఈ సినిమా తరువాత బన్నీతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కట్టారు. తెలుగు వారు మాత్రమే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా బన్నీతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ స్టార్ డైరెక్టర్స్ అందరిని కాదనో  బన్నీ స్టామినాను పెంచే పెద్ద ప్లాన్  ను అల్లు అరవింద్ వేసినట్లు తెలుస్తోంది. బన్నీకి మాస్ ఫాలోవర్స్ ను పెంచిన సినిమా సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు.. బన్నీ గ్లోబల్ స్థాయిని నిలబెట్టడానికి అలాంటి మాస్ సినిమా ఒకటి కావాలని అభిప్రాయపడ్డ అరవింద్.. బోయపాటితోనే సరైనోడు 2 తీయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


ప్రస్తుతం బోయపాటి.. అఖండ 2 తో బిజీగా ఉన్నాడు. అఖండతో బోయపాటికి మరింత గుర్తింపు లభించింది. ఎలాగైనా అఖండ 2 తరువాత సరైనోడు 2 ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట అరవింద్. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇది మంచి మూవ్ నే అయినా.. బన్నీ – త్రివిక్రమ్ సినిమా సంగతి కూడా ఆలోచించాలి కదా అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత.. బోయపాటి- బన్నీ.. సరైనోడు 2 వర్క్ అవుట్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×