Gold Rate Dropped: పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఆడవారికి బంగారం అంటే మహా ఇష్టం. ప్రతి శుభకార్యానికి బంగారం ధరించాల్సిందే. అంతగా పసిడి మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. ప్రస్తుతం పసిడి మళ్లీ కొండెక్కి కూర్చుంది. అమెరికా టారిఫ్‌లు, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో.. మదుపరులు పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు విన్న పసిడి ప్రియులు మాత్రం షాక్‌కు కావాల్సిందే.
నేటి బంగారం ధరలు..
అయితే నిన్న మోన్నటి వరకు బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. కాని ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,970 ఉండగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,860 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,950 వద్ద పలుకుతోంది. అంటే 10 గ్రాముల తులం బంగారం పై రూ.110 తగ్గింది. ఇలాగే కొద్ది కొద్దిగా తగ్గిన బంగారం ధరలు పసిడి ప్రియులు కాస్త ఊపిరి పిల్చుకుంటారు. అయితే బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అని పసిడి ప్రియులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,06,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,950 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,950 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,950 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,010ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,100 వద్ద పలుకుతోంది.