JioStar New Plans: ఇండియన్ మీడియా ఇండస్ట్రీలో అతి పెద్ద డీల్ పూర్తయ్యింది. రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఇండియా విలీనం పూర్తయ్యింది. ఈ విలీనంతో ఏకంగా రూ. 70,352 కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా వెంచర్ ఏర్పడింది. జియో స్టార్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థలో 16.34 శాతం వాటాను దక్కించుకుంది. వయాకామ్ 18కి 46.82 శాతం వాటాను కలిగి ఉండగా, డిస్నీ 36.84 శాతం వాటాను పొందింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థకు ఛైర్ పర్సన్‌గా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నియామకం అయ్యాడు. వైస్ ఛైర్ మెన్ గా ఉదయ్ శంకర్ ఎన్నికయ్యారు. ఈ విలీనంతో 100కు పైగా టీవీ ఛానెళ్లు ఒకే గొడుగు కిందకి రానున్నాయి. జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలు కలిపి జియో స్టార్ మారాయి.
అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించిన జియో స్టార్
విలీన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో జియో స్టార్ కొత్త ప్లాన్లను ప్రకటించింది. కేవలం రూ. 15తో ప్రారంభ ప్లాన్ ను పరిచయం చేసింది. ఇంతకీ జియో స్టార్ పరిచయం చేసిన కొత్త ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
Standard Definition ఛానెళ్లు
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ హిందీ: నెలకు రూ. 59
⦿స్టార్ ప్రీమియం ప్యాక్ హిందీ: నెలకు రూ. 105
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ మరాఠీ హిందీ: నెలకు రూ. 67
⦿ స్టార్ ప్రీమియం ప్యాక్ మరాఠీ హిందీ: నెలకు రూ. 110
⦿ స్టార్ విలువ బెంగాలీ హిందీ: నెలకు రూ. 65
⦿ స్టార్ ప్రీమియం ప్యాక్ బెంగాలీ హిందీ: నెలకు రూ. 110
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ ఒడియా హిందీ మినీ: నెలకు రూ. 15
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ ఒడియా హిందీ: నెలకు రూ. 65
⦿ స్టార్ ప్రీమియం ప్యాక్ ఒడియా హిందీ: నెలకు రూ. 105
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ కన్నడ హిందీ మినీ: నెలకు రూ. 45
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ కన్నడ హిందీ: నెలకు రూ. 67
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ హిందీ కన్నడ: నెలకు రూ. 67
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ తెలుగు హిందీ: నెలకు రూ. 81
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ హిందీ తెలుగు: నెలకు రూ. 81
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ తెలుగు హిందీ మినీ: నెలకు రూ. 70
Kids ఛానెళ్లు
⦿ డిస్నీ కిడ్స్ ప్యాక్: నెలకు రూ. 15
⦿ డిస్నీ హంగామా కిడ్స్ ప్యాక్: నెలకు రూ. 15
High Definition ఛానెళ్లు
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ లైట్ HD హిందీ: నెలకు రూ. 88
⦿ స్టార్ ప్రీమియం ప్యాక్ లైట్ HD: నెలకు రూ. 125
⦿ స్టార్ వాల్యూ ప్యాక్ మరాఠీ లైట్ హిందీ HD: నెలకు రూ. 99
⦿ డిస్నీ కిడ్స్ ప్యాక్ HD: నెలకు రూ. 18
⦿ డిస్నీ హంగామా కిడ్స్ ప్యాక్ HD: నెలకు రూ. 18