BigTV English

Google Maps Air Quality Index : గూగుల్ మ్యాప్స్ లో సూపర్ అప్డేట్.. ఈ సెట్టింగ్స్ మారిస్తే చాలు.. మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ చెప్పేస్తుంది

Google Maps Air Quality Index : గూగుల్ మ్యాప్స్ లో సూపర్ అప్డేట్.. ఈ సెట్టింగ్స్ మారిస్తే చాలు.. మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ చెప్పేస్తుంది

Google Maps Air Quality Index : గూగుల్ మ్యాప్స్‌‌.. ఎంత దూర ప్రయాణానికైనా ఇట్టే తేలికగా దారి చూపించేస్తుంది ఈ యాప్. గూగుల్ మ్యాప్ ఉంటే చాలు ప్రపంచాన్ని తేలికగా చుట్టి వచ్చెయ్యెచ్చు. మరి అలాంటి యాప్ లో గూగుల్ మరో లేటెస్ట్ ఫీచర్ ను తీసుకొచ్చింది. అసలు ఏంటి ఆ ఫీచర్… ఎలా పనిచేస్తుందో చూద్దాం.


ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఉంటే చాలు. ఈ ఒక్క యాప్ తో ప్రపంచం ఎంత చిన్నదో అనిపిస్తుంది. అయితే ఈ ఇకపై ఈ యాప్ లో కేవలం అడ్రస్ వెతుక్కోవడమే కాదు.. చుట్టూ ఉండే గాలి నాణ్యతను కూడా చెక్ చేసేయెుచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ ను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్​ యాప్​లో రియల్​ టైమ్ యావరేజ్ ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ (AQI)ను తేలికాగా చెక్ చేసెయెుచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉండే ప్రదేశంలో గాలి నాణ్యతను ఇట్టే పట్టేయెుచ్చు.

ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే –


గూగుల్ మ్యాప్స్​ లో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ ప్రతి గంటకు అప్డేట్ అవుతూ ఉంటుంది. దీంతో భారత్ లో ఉన్న ఏ ప్రదేశంలోనైనా ఎయిర్ క్వాలిటీని తెలుసుకోవచ్చు. 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తెస్తుంది. ఇక గూగుల్ మ్యాప్​ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే ఫార్మెట్​లో అందిస్తుంది. ఇక ఈ క్వాలిటీ 0 నుంచి 500 వరకు కాలుష్యాల ఆధారంగా రేటింగ్ ఇస్తుంది.

ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ వివరాలివే –

0 to 50 is Fine
51 to 100 is Satisfactory
101 to 200 Medium
201 to 300 is Poor
301 to 400 is Very Poor
401 to 500 Very Poor

కలర్స్ –

ఎయిర్ క్వాలిటీని చెప్తూ గూగుల్ డిఫరెంట్ కలర్స్​ను ఉపయోగిస్తుంది. మ్యాప్​లోని గాలి నాణ్యతపై సరైన సమాచారాన్ని అందిస్తుంది.  0 to 50 is Fine అని చెప్పేందుకు గ్రీన్​ కలర్​ను ఇస్తుంది. ఇక 401 to 500 Very Poor వేరీ పూర్ అని  చెప్పేందుకు రెడ్ కలర్​ను చూపిస్తుంది.

హెచ్చరిక –

చుట్టూ ఉండే ప్రదేశంలో వాతావరణం, గాలి సరిగా లేనప్పుడు గూగుల్ మ్యాప్ హెచ్చరిస్తుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే బయటకు రావొద్దని చెబుతుంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉంటే మంచిదని.. ఎయిర్ క్వాలిటీ సరిగా లేని ప్రదేశాల్లో ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించాలని తెలుపుతుంది. అంతే కాకుండా సరైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకోటానికి గైడెన్స్ సైతం అందిస్తుంది.

ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే –

ఎయిర్​ క్వాలిటీ గురించి తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్​ను ఓపెన్ చేయాలి
లేయెర్స్ ఐకాన్​పై క్లిక్​ చేయాలి
ఎయిర్​ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి
ఇప్పుడు లొకేషన్ రియల్​ టైమ్ AQIని చూపిస్తుంది.

ఇక ఈ ఫీచర్ ను ఉపయోగించి ఏదైనా ప్రదేశానికి వెళ్లే ముందు అక్కడ ఎయిర్ క్వాలిటీని సైతం తెలుసుకోవచ్చు. ట్రావెలర్స్ కు ఈ ఫీచర్ బెస్ట్ ఆప్షన్. ఇక చిన్న పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే వారు సైతం ఎంతో తేలికగా ఉపయోగించి జర్నీని ఎంజాయ్ చెయ్యెచ్చు.

ALSO READ : వివో జోరు.. రూ. 9499కే కొత్త మెుబైల్… ధర తక్కువైనా స్టోరేజ్, కెమెరా క్వాలిటీలో ఏ మాత్రం తగ్గలే

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×