మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా పథకాలు రచిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర రైతులతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను రాహుల్ గాంధీకి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రాహుల్ ఎన్నికల్లో గెలిపిస్తే పలు హామీలు అమలు చేస్తామని వారికి చెప్పారు. వచ్చే డబ్బులతో తమ బిడ్డలను ఏం చదివిస్తామో.. ఏం తిండి పెడతామో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర రైతుల కోసం మహావికాస్ అఘాడీ కూటమి చారిత్రాత్మక అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు.
సోయాబీన్ కు క్వింటాలుకు రూ.7000 ఎంఎస్ ప్లస్ బోనస్ ఇస్తామని చెప్పారు. ఉల్లికి కూడా సరైన మద్దతు ధర నిర్ణయించేందుకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా పత్తికి కూడా మద్దతు ధర ఇచ్చి ఆ రైతులను సైతం ఆదుకుంటామని చెప్పారు. గత మూడు ఎన్నికలలో సోయాబీన్ కు రూ.6వేల రూపాయలు ఎంఎస్పీ ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసిందని చెప్పారు. కానీ నేటికీ రైతులు తమ రక్తం, చెమటతో పండించిన సోయాబీన్ కు రూ.3వేల నుండి రూ.4వేల రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు.