BigTV English

Gold Price : భలే మంచి చౌక బేరము.. గోల్డ్ ప్రియులకు కలిసొచ్చే కాలం

Gold Price : భలే మంచి చౌక బేరము.. గోల్డ్ ప్రియులకు కలిసొచ్చే కాలం

Gold Price Today : మొన్నటి వరకూ భారీగా పెరిగిన ధరలతో ధగధగ మెరిసిన పసిడి.. ఇప్పుడు వెలవెలబోతోంది. ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం, వెండి, ప్లాటినం లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అంతే.. బంగారం ధర ఆ రోజే ఒక్కసారిగా రూ.3000 తగ్గింది. ఇక నిన్న 10 గ్రాముల బంగారంపై మరో రూ.1000 తగ్గింది. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది.


హైదరాబాద్ లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 వేలు ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.69,820గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో 10 రోజుల్లో ఆషాఢ మాసం ముగిసి.. శ్రావణ మాసం మొదలు కానుంది. సాధారణంగా శ్రావణమాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. అలాగే వరలక్ష్మి దేవి వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. అలాంటి వారికి బంగారం ధర కాస్త తగ్గడం ఊరటనిచ్చే విషయమే.

ఇక వెండి కూడా బంగారం మాదిరిగానే తగ్గుతూ వస్తోంది. కిలో వెండి రూ.99000 కి చేరడంతో.. వెండి కూడా అందని ద్రాక్షగా మారిందని దిగులుపడ్డారు. దీనిపై కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం ఒక్కరోజే కిలో వెండిపై రూ.3500 తగ్గి రూ.84 వేలకు దిగివచ్చింది. ఈ రోజు కూడా అదే ధర కొనసాగుతోంది.


Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×