Investment Tips: ప్రస్తుతం అనేక మంది యువత తక్కువ వయస్సులోనే పలు రకాల జాబ్స్ చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఈ విధంగా యువత ఉద్యోగాలు చేస్తున్నారు కానీ, వారి సేవింగ్స్, ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ మీరు ఇప్పటి నుంచే మంచి ఆర్థిక ప్రణాళికను పాటిస్తే మాత్రం మీరు దీర్ఘకాలంలో అదిరిపోయే మొత్తాన్ని పొందవచ్చు. ఎంత అంటే మీరు నెలకు జస్ట్ రూ. 5400 సేవ్ చేస్తే, చివరకు మీకు 2 కోట్ల రూపాయలకుపైగా లభిస్తాయి. అవును మీరు విన్నది నిజమే. ఇందులో ఎలాంటి రిస్క్, మోసం లేదు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిని మరింత బలంగా ఉంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) సేవ్ చేయాల్సి ఉంటుంది. దీనిని భారతదేశంలోని ప్రతి 18 ఏళ్ల పైబడిన యువతీ యువకులు అందరూ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. ఇందులో ప్రస్తుతం వార్షిక వడ్డీ శాతం 10 నుంచి 15 శాతంగా (మార్కెట్ లింక్) ఉంది.
ఈ స్కీంలో మీరు 25 ఏళ్ల వయసులో చేరి, నెలకి రూ. 5,400 సేవ్ చేస్తే 60 ఏళ్ల తర్వాత మీకు భారీ మొత్తం లభిస్తుంది. మీరు NPSలో వివిధ రకాలుగా పెట్టుబడులు చేసుకోవచ్చు. ఉదాహరణకు అప్పటి మార్కెట్ పరిస్థితిని బట్టి స్టాక్స్, బాండ్లు సహా ఇతర ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇది ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతుంది, కాబట్టి పెట్టుబడులపై మరింత భద్రత ఉంటుంది. మీరు దీనిలో వార్షిక పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు.
Read Also: SIP vs RD: వీటిలో ఏది బెస్ట్.. దేనిలో ఎక్కువ మొత్తం లభిస్తుంది..
మీరు 25 ఏళ్ల వయస్సులో ఈ స్కీంలో నెలకు రూ. 5,400 పెట్టుబడి చేయాలని భావిస్తే, సంవత్సరానికి రూ. 64,800 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు మొత్తం 35 సంవత్సరాలు ఈ పథకంలో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాలపాటు నెలకి రూ. 5,400 పెట్టుబడి చేస్తే, 60 ఏళ్ల తర్వాత మీరు పొందే మొత్తం రూ. 2,05,01,845 అవుతుంది. అంటే మీరు చేసిన పెట్టుబడి రూ. 22,68,000 లక్షలు కాగా, మీకు వడ్డీ రూపంలోనే కోటి 82 లక్షలకుపైగా లభిస్తుంది.
NPSలో పెట్టుబడులు చేయడం ద్వారా మీకు అదనపు పన్ను లాభాలు ఉంటాయి. అంటే మీరు రూ. 50,000 వరకు NPSలో పెట్టుబడి పెట్టినప్పుడు, Section 80C ప్రకారం పన్ను మినహాయింపు పొందుతారు. అదనంగా మీరు Section 80CCD(1B) ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు రిటైర్మెంట్ తరువాత ఈ మొత్తాన్ని తీసుకునే సమయంలో మీరు అనేక రకాల డివిడెండ్‌లు, పథకాల్లో పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
కానీ మీ పెట్టుబడుల రిటర్న్స్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారే అవకాశం ఉంటుంది. అంటే రాబడి రేటు పెరిగితే మీకు మరింత మొత్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోయినా మీకు కనీసం స్థిరంగా 10 శాతం అయితే వచ్చే అవకాశం ఉంది.