Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన బర్తడే సందర్భంగా తన భార్య సురేఖ (Surekha) తో కలసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అక్కడే మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే అబుదాబిలో ఉన్న ప్రత్యేకమైన హిందూ దేవాలయాన్ని సందర్శించి, తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని అందరిని ఆశ్చర్యపరిచారు. తన సతీమణి సురేఖతో కలిసి అబుదాబిలోని BAPS మందిరాన్ని సందర్శించిన చిరంజీవి.. గల్ఫ్ దేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయం అయిన ఈ దేవాలయం గురించి, దాని వైభవం గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ తెలిపారు చిరంజీవి.
అబుదాబిలో హిందూ దేవాలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన చిరు..
చిరంజీవి.. సురేఖతో కలిసి ఆలయాన్ని సందర్శించిన తర్వాత.. ఒక వీడియో రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో..” ఈ అద్భుతాన్ని సందర్శించడానికి నేను ఎంతో ఆకర్షించబడ్డాను. అయితే ఈ అనుభూతిని నేను మాటల్లో వ్యక్తపరచలేను. కానీ నా హృదయమే చెప్పాలి.. ఈ దేవాలయంలోని ప్రతి మూల అలాగే దాని ప్రత్యేకతను.. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ ఆలయంలోని ప్రతి ప్రదేశం కూడా ఒక అద్భుతమే. ఒక మతం కాదు, ఆధ్యాత్మికత కాదు, అంతకుమించి ఇక్కడ ఏదో ఉంది. కానీ నేను ఆలయ ప్రాంగణంలో ఇస్లామిక్ దేశానికి ఇచ్చిన ప్రాముఖ్యత అసమానమైనది. స్వామీజీ ఆలోచన ఈరోజు ఈ రూపంలో వ్యక్తం అయింది. ఇది అంత తేలికైన పని కూడా కాదు. 99శాతం మంది ఇక్కడ ఆలయం నిర్మించడం అసాధ్యమైన పని అని చెప్పినప్పుడు, అబూదాబిలో హిందూ ఆలయాన్ని నిర్మించాలని పూనుకున్న ప్రముఖ స్వామీజీ మహారాజ్ సంకల్పానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఆలోచన బలమే నేడు ఇంత పెద్ద ఆలయానికి పునాదులు వేసింది. 99 శాతం ప్రజలు మీరు ఇక్కడ ఆలయాన్ని నిర్మించలేరు అని, ఆయనను వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించగలను అని, తనను తాను నమ్ముకొని నేడు స్వామీజీ ఇక్కడ ఒక మహా అద్భుతాన్ని వాస్తవం చేసి చూపించారు.. అలాగే నా కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేవలం రెండేళ్లలోనే 5000 మందికి పైగా ఇక్కడ పనిచేసి ఈ అద్భుతాన్ని సృష్టించారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. మళ్లీ అబుదాబికి వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు చిరంజీవి.
Shraddha Kapoor: పెళ్లికి సిద్ధమైన శ్రద్ధ.. వాల్ పేపర్ లీక్..!
ఆలయం గొప్పతనం గురించి మాటల్లో చెప్పలేనంటూ..
అలాగే హిందూ విశ్వాసాన్ని స్వీకరించి అబూదాబిలో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణాన్ని సులభతరం చేసినందుకు.. యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మొత్తానికైతే హిందూ దేవాలయానికి, అక్కడ వారు ఇచ్చిన ప్రాముఖ్యతకు మంత్రముగ్ధులైన చిరంజీవి తన మాటలలో కూడా వివరించలేను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆ దేవాలయానికి సంబంధించిన వీడియో ని కూడా ఆయన షేర్ చేయడంతో ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో అందరూ చూసి మైమరచిపోతున్నారు. మొత్తానికి అయితే ఇంత గొప్ప ఆలయాన్ని అందరికీ చూపించి అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు చిరంజీవి.