Big Stories

Updated Kia Carnes @ Rs 12.12 Lakhs: అదిరిపోయిన 6 సీటర్ కియా కేరెన్స్ అప్‌డేట్ ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Kia Carens 2024
Kia Carens 2024

Updated Featured Kia Carens 2024 @ Rs 12.12 Lakhs: కియా ఇండియా భారతదేశంలో తాజాగా కియా కేరెన్స్ 2024 ఎంపివిని విడుదల చేసింది. ఇది అప్‌డేట్ చేయబడిన ఫీచర్‌లతో ప్రారంభించబడింది. కియా మోటార్స్ ఇండియా ఇటీవలే సోనెట్ అప్‌డేట్‌ను అనుసరించి దాని ప్రసిద్ధ MPV, కియా కేరెన్స్‌ను అప్‌డేట్ చేసింది. 2024 కేరెన్స్ ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లు, మెరుగైన సౌకర్యాలు, అదనపు వేరియంట్‌లను కలిగి ఉంది.

- Advertisement -

కొత్త ఫీచర్లు:

- Advertisement -

కియా ఇండియా భారతదేశంలో 2024 కారెన్స్ MPVని రూ.10.52 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్) రిలీజ్ చేసింది. డీజిల్ ఇంజిన్ కరెన్స్ ధర రూ.12.67 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కాగా కంపెనీ 6-సీటర్ కేరెన్స్‌ను రూ.12.12 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. కొత్త డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక కారెన్స్‌కి సంబంధించి మొత్తం 23 నుండి 30 వరకు వేరియంట్‌లు ఉన్నాయి.

కియా క్యారెన్స్ కోసం ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ముఖ్యంగా డీజిల్-ఆధారిత వేరియంట్‌లపై ఫోకస్ పెట్టింది. కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇది ఇంతకముందు క్లచ్‌లెస్ iMT గేర్‌బాక్స్ స్థానంలో ఉంది. ఈ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌తో సహా ఆరు డీజిల్-ఆధారిత ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.

దీని ప్రెస్టీజ్+ (O) వేరియంట్ ఇప్పుడు సన్‌రూఫ్, LED మ్యాప్ ల్యాంప్, రూమ్ ల్యాంప్‌తో వస్తుంది. అలాగే, ఇది 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ AT గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతోంది.

Also Read: ఏంటి భయ్యా ఈ క్రేజ్.. భారీగా పెరిగిన ఆడి అమ్మకాలు

అదనంగా, ప్రెస్టీజ్ (O) వేరియంట్ అనేక కొత్త ఫీచర్లను పొందుతుంది. వీటిలో లెథెరెట్-వ్రాప్డ్ గేర్ నాబ్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్-కీ, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్, LED DRL, పొజిషనింగ్ ల్యాంప్ ఉన్నాయి. విశేషమేమిటంటే ప్రెస్టీజ్ (O)ని 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.

దీని ప్రీమియం (O) వేరియంట్ మరింత ఫీచర్-రిచ్‌గా మారింది. ఇది కీలెస్ ఎంట్రీ, 8-అంగుళాల D/ఆడియో సిస్టమ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ రిమోట్ కంట్రోల్, బర్గ్‌లర్ అలారంను కలిగి ఉంది. అంతేకాకుండా కియా ఇండియా అన్ని కేరెన్స్ వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ల కోసం 180W ఛార్జర్‌ను అందించింది. ఇది ఇంతకు ముందు అందుబాటులో ఉన్న 120W ఛార్జర్ కంటే శక్తివంతమైనది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News