BigTV English

30% Audi Car Sales in India: ఏంటి భయ్యా ఈ క్రేజ్.. భారీగా పెరిగిన ఆడి అమ్మకాలు!

30% Audi Car Sales in India: ఏంటి భయ్యా ఈ క్రేజ్.. భారీగా పెరిగిన ఆడి అమ్మకాలు!
Audi Car Sales
Audi Car Sales

30% Audi Car Sales in India: లగ్జరీ కార్లకు దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. దేశంలోని ధనికులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ కార్ల ధరలు కోట్లలో ఉంటాయి. ఇందులోని ఫీచర్ల కూడా మతిపోయేలా ఉంటాయి. ఇక 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అమ్మకాల్లో దూసుకుపోయింది. భారత్‌లో 30 శాతం సేల్స్ పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో ఏ మోడళ్లు ఉన్నాయి, తదితర విషయాలను తెలుసుకోండి.


లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గత ఏడాది కాలంలో భారతదేశంలో 7027 కార్లను విక్రయించింది. అందులో SUV వెహికల్స్ కూడా ఉన్నాయి. కంపెనీ లెక్కల ప్రకారం అమ్మకాల్లో 33 శాతం వృద్ధిని సాధించింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ..  అద్భుతమైన పోర్ట్‌ఫోలియో ఆధారంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 33 శాతం బలమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఆడి వాహనాలకు  మార్కెట్‌లో బలమైన డిమాండ్ కొనసాగుతోంది అన్నారు. సరఫరాకు సంబంధించిన సవాళ్లను అధిగమించడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. లగ్జరీ కార్ మార్కెట్‌లో 2024 నాటికి 50,000  కార్ల అమ్మకాల సంఖ్యను దాటే అవకాశం ఉందని తెలిపారు.

Also Read : మార్చి నెలలో లాంచ్ అయిన సూపర్ కార్స్ ఇవే..!


భారత మార్కెట్‌లోని ఆడి కొత్త మోడళ్లతో పాటు పాత వేరియంట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కంపెనీ యూజ్డ్ కార్లను అప్రూవ్డ్ ప్లస్ పేరుతో  విక్రయిస్తుంది. కంపెనీ ప్రకారం.. జనవరి, మార్చి నెలలో 2024 మధ్య 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో 50 శాతం వృద్ధి నమోదైంది.

ఆడి భారత మార్కెట్లో 17 కార్లలను, SUVలను అందిస్తోంది. వీటిలో ICE వెహికల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం ఆడి ఎ4, ఆడి ఎ6, ఆడి ఎ8 ఎల్, ఆడి క్యూ3, ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి క్యూ8, ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆడి క్యూ8 50 ఇ-ట్రాన్, ఆడి ఇది Q8 55 e-tron, Audi Q8 Sportback 50 e-tron, Audi Q8 Sportback 55 e-tron, Audi e-tron GT మరియు Audi RS e-tron GT వంటి వాహనాలు ఉన్నాయి.

Also Read: మార్కెట్లోకి రానున్న న్యూ స్పోర్ట్స్ బైక్స్.. ఫీచర్స్ చూస్తే ఉంటది నా సామి రంగ..!

ఆడి నుంచి మార్కెట్‌లోకి ప్రతి వేరియంట్.. చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం మార్కెట్‌లో వీటికి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. వీటి లోపల ఓ 5 స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుంది. కార్ ఫీచర్స్‌, లుక్ అమెజింగ్‌గా ఉంటాయి.

Related News

GOLD RATE IN DUBAI: దుబాయ్‌లో బంగారం ధర చాలా చీప్.. భారత్‌తో పోలిస్తే ఎంత డబ్బు ఆదా..?

Post Office Scheme: రూ. 5 లక్షల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం.. వెంటనే ట్రై చేయండి!

BSNL Offers: రోజూ 2జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ.. సెప్టెంబర్ లో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!

Jio Offers: జియో రీఛార్జ్ చేసుకోండి, క్రేజీ క్యాష్ బ్యాక్ ఆఫర్ పట్టేయండి!

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Credit Card Limit: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆఫర్ చూసి ఆశపడుతున్నారా…అయితే ఇది మీ కోసం…

Big Stories

×