BigTV English

Knot Dating App: రూ.50 లక్షలు జీతం కలిగిన అబ్బాయి కావాలా? అమ్మాయిలూ ఈ యాప్ మీ కోసమే!

Knot Dating App: రూ.50 లక్షలు జీతం కలిగిన అబ్బాయి కావాలా? అమ్మాయిలూ ఈ యాప్ మీ కోసమే!

వరుడు కావలెను..
మంచి రూపం, మంచి ఉద్యోగం, మంచి జీతం..
పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు వధువు కుటుంబాల నుంచి ఇలాంటి కండిషన్లు ఉంటాయని మనకు తెలుసు. దాదాపు ఇలాంటి మంచి ప్రొఫైల్ ఉన్న వారికే మ్యాట్రిమోనియల్ సైట్ లలో త్వరగా సంబంధాలు కుదురుతాయి. కుల గోత్రాల పట్టింపు లేనివారు కనీసం అబ్బాయిల అలవాట్లపై అయినా ఆరా తీస్తారు. కానీ రాను రాను రోజులు మారిపోతున్నాయి. అబ్బాయి ఎలా ఉన్నా ఓకే, ఏయే అలవాట్లు ఉన్నా ఓకే, కానీ జీతం మాత్రం రూ.50 లక్షలకు తగ్గకూడదంటూ తాజాగా ఓ మ్యాట్రిమోనియల్ సైట్ కండిషన్ పెట్టింది. నాట్ డాట్ డేటింగ్ (http://Knot.dating) పేరుతో ఉన్న ఈ వెబ్ సైట్ కమ మొబైల్ యాప్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


అమ్మాయిలకు నో కండిషన్స్..
పెళ్లి సంబంధాలు చూసేందుకు ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ ఓ సంచలనంగా మారింది. అబ్బాయిలకు రూ.50 లక్షల జీతం ఉండాలంటూ కండిషన్ పెట్టారు కానీ, అమ్మాయిలకు మాత్రం అలాంటి నిబంధనలేవీ లేకపోవడం విశేషం. ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా అమ్మాయిలు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావొచ్చు. కానీ అబ్బాయిలు మాత్రం రూ.50 లక్షలు జీతం ఇచ్చే ఉద్యోగం ఉంటేనే పెళ్లి సంబంధాలు వెదుక్కోడానికి అర్హులు. ఇంత కాస్ట్ లీ వ్యవహారం కాబట్టే ఈ యాప్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబ్బాయిల సంగతి పక్కనపెడితే మంచి క్యాష్ పార్టీలు కావాలనుకునే అమ్మాయిలు మాత్రం ఈ యాప్ లో వెంటనే లాగిన్ అయిపోతున్నారు. తమకు పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం తెగ వెదికేస్తున్నారు.

ఏఐ సంబంధాలు..
నాట్ డాట్ కామ్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారికి కాల్ చేయడం దగ్గర్నించి డౌట్స్ క్లారిఫై చేయడం వరకు అన్నీ ఏఐ చూసుకుంటుంది. అబ్బాయి, అమ్మాయి అభిరుచులను మ్యాచ్ చేయడం, సూక్ష్మమైన అంశాల్లో కూడా ఇరువురి అభిప్రాయాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో తేల్చడం ఏఐ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే తాము పర్ఫెక్ట్ మ్యాచ్ చూపించగలుగుతామని చెబుతున్నారు నిర్వాహకులు. ప్రొఫైల్ మ్యాచ్ అయ్యే టైమ్ కి ఉద్యోగులు కూడా రంగంలోకి దిగుతారనుకోండి. అయితే సంబంధాలు కుదిర్చేది మాత్రం ఏఐనే అని ఈ యాప్ నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇండియాలోనే ఇది కాస్ట్ లీ మ్యాట్రిమోనియల్ యాప్ కావడంతో అందరూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.


ఆ అనుమానం వద్దు..
పేరులో డేటింగ్ అనే పదం ఉంది కాబట్టి దీన్ని డేటింగ్ యాప్ అనుకోవద్దని అంటున్నారు నిర్వాహకులు జస్వీర్ సింగ్, అభిషేక్ అస్థానా. డేటింగ్ తో విసిగిపోయిన వారికి ఇది కచ్చితంగా మంచి సంబంధాలను వెదికిపెడుతుందని వివరించారు. ఇక 50 లక్షల రూపాయల జీతం కండిషన్ పై కూడా వారు సూటిగా స్పందించారు. ఈ కండిషన్ ఓ కచ్చితమైన ఫిల్టర్ గా ఉపయోగపడుతుందని వారు చెప్పారు. అధిక ఆదాయం ఉన్న వరుడికోసం వెదికే అమ్మాయిలకు తమ యాప్ కచ్చితంగా ఓ మంచి సంబంధాన్ని చూపిస్తుందని చెప్పారు. పేటీఎం, భారత్ పే, క్రెడ్, బుక్ మై షో వంటి కంపెనీలు కూడా ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టడం విశేషం. పెళ్లి సంబంధాలను కుదర్చడంలో వస్తున్న నూతన పోకడలకు ఈ యాప్ మరో మలుపు అని చెప్పాలి.

Related News

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Jio Offers: జియో రీచార్జ్ ప్లాన్స్ 2025.. 75 నుండి 223 రూపాయల వరకు సులభమైన ప్లాన్స్

BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

Gold rate: అయ్యయ్యో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×