Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్లలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా వైజాగ్ (Vizag)లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇదివరకే హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది తాజాగా మరోసారి వైజాగ్ లో కూడా నోవాటెల్ హోటల్ లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ మైక్ చేత పట్టుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు.
అడగడానికి ఇబ్బంది…
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు. నాకు చిన్నప్పటినుంచి కూడా ఒక అలవాటు ఉంది. నాకు ఏదైనా కావాలి అంటే ఇతరులను అడగడానికి కాస్త సిగ్గుగా ఉంటుంది. అడుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇవ్వటమే తెలుసు కానీ అడగటం తెలియదు. కానీ నేను అడగకుండానే మీరు నా సినిమాలకు హిట్ ఇస్తారని తెలుసు అంటూ అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాజకీయాలలోకి(Politics) వచ్చి ఓటు వేయమని అడగడానికి ఎంత ఇబ్బంది పడతానో నా అభిమానులను ఉద్దేశించి సినిమాలు చూడమని చెప్పటానికి కూడా అంతే ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
నాకు ఇవ్వటమే తెలుసు..
ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున గోల చేస్తున్న నేపథ్యంలో మీ అరుపులు ఆపిన తర్వాతే మాట్లాడతానని తెలిపారు. రేపు థియేటర్లలో అరవడానికి శక్తిని దాచుకోండి అంటూ అభిమానులకు సూచించారు. అలాగే ఈ వేడుక వైజాగ్ లో జరపాలని తాను చాలా పట్టు పట్టానని, వైజాగ్ తో తనకున్న అనుబంధం గురించి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకు ఏకంగా రెండు ప్రీ రిలీజ్ వేడుకలు జరగడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ ఎంట్రీ తో పెరిగిన బజ్…
ఇన్ని రోజులు ఇతర సినిమా షూటింగ్ పనులు రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టి వరుస ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఈవెంట్లతో సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేశారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులలో కూడా ఏదో తెలియని ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సారి విడుదలవుతున్న సినిమా కావడంతో అభిమానులకు కూడా ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా మారిపోయింది ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల జాతర మొదలైంది.
Also Read: Pawan Kalyan:గింజలతో పవన్ ముఖచిత్రం.. అభిమానం చాటుకున్న చిత్తూరు వాసీ!