BigTV English

KTM 200 Duke: కేటీఎమ్ బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇప్పుడు మరింత స్టైలిష్ లుక్‌‌లో

KTM 200 Duke: కేటీఎమ్ బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇప్పుడు మరింత స్టైలిష్ లుక్‌‌లో

KTM 200 Duke: భారత మార్కెట్‌లో ‘KTM Duke’ బైక్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బైక్ లుక్‌ అండ్ డిజైన్‌కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అంతేకాకుండా దాని సౌండ్ కూడా బైక్ ప్రియులను ఆట్టుకుంటుంది. అందువల్లనే ఎక్కువ మంది యూత్ ఈ బైక్‌ను ఇష్టపడతారు. అయితే తాజాగా కేటీఎమ్ తమ బైక్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.


KTM 200 Duke బైకులను కొత్త కలర్ స్కీమ్‌లలో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు ఉన్న ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గ్రే మ్యాట్‌తో పాటు ఇప్పుడు రెండు కొత్త రంగులు వచ్చాయి. ఈ రెండు కొత్త కలర్స్ ‘‘ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వనో’’తో వచ్చాయి. త్వరలో ఈ బైక్ కొత్త కలర్ వేరియంట్‌లో మార్కెట్‌లో దర్శనమివ్వనుంది. అందువల్ల కొత్త కలర్ ఆప్షన్ కోరుకునే వారికి ఇదొక శుభవార్తే అని చెప్పాలి.

ఇంతకు ముందు ఒక్క కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ఇప్పుడు మరో రెండు కలర్‌లతో మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుందని తెలుస్తోంది. KTM 200 అదే 200 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా KTM 200 డ్యూక్ సిల్వర్ మెటాలిక్ కలర్ మునుపటిలాగే అందుబాటులో ఉంటుంది. పనితీరులో కూడా ఎలాంటి మార్పులు లేవు. పూర్తి LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.


Also Read: హోండా నుంచి రెండు కొత్త బైకులు.. షేక్ చేస్తున్న ఇంజన్, ఫీచర్లు..!

అలాగే మరింత నియంత్రణ కోసం ABS వ్యవస్థను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ WP USD ఫోర్క్, మోనో-షాక్ రియర్ సస్పెన్షన్, అల్యూమినియం స్వింగార్మ్‌తో కూడిన తేలికపాటి ట్రేల్లిస్ ఫ్రేమ్ కారణంగా అద్భుతమైన హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంది. ఈ బైక్స్ చాలా వేగంగా వెళ్తాయి. ఇది మొత్తం 13.4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది.

భారతీయ బైక్ మార్కెట్‌లో కేటీఎం 200 డ్యూక్ ధర రూ.1.98 లక్షల ఎక్స్ షోరూమ్‌తో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌ను తీసుకువస్తుంది. కాబట్టి దీని ధరలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బైక్‌ను అధికారికంగా విడుదల చేసిన తర్వాత ఈ బైక్ అసలు ధరతో సహా ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×