BigTV English

YSR Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల.. సేవలు కొనసాగిస్తారా ?

YSR Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల.. సేవలు కొనసాగిస్తారా ?

Govt Released Funds for YSR Aarogyasri Scheme(AP news live):

ఆరోగ్య శ్రీ సేవల పెండింగ్ బిల్లుల కోసం ఏపీ ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 1500 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఇవాల్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్‌ అసోసియేషన్‌ నిన్న ప్రకటించింది. సేవలను కొనసాగించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులకు, హాస్పిటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో నిన్న చర్చించారు.


సేవలు కొనసాగించాలని కోరారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సేవల కొనసాగింపు కొనసాగించేది లేదని తేల్చి చెప్పారు. ప్రకటనలు తప్ప బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్టు తమకు కనిపించడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.

దీంతో.. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వం హుటాహుటిన 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో హాస్పిటల్‌ అసోసియేషన్‌ ఎలా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది. సేవలు కొనసాగిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది.


 

Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×