DSSSB Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది పండగ లాంటి వార్త.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీకామ్, బీఈడీ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి 615 ఫారెస్ట్ గార్డ్, కేర్ టేకర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్‌లో చేసుకోవచ్చు. ఆగస్టు 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 19న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 615
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఫారెస్ట్ గార్డ్, కేర్ టేకర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్…
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 18
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 16
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీకామ్, బీఈడీ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/
అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 615
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 16
జీతం: రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది.
ALSO READ: CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..