BigTV English
Advertisement

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Vindhya Vishaka :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో టీమిండియా 5వ టెస్ట్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వింద్య విశాఖ మేడపాటి ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వింధ్య విశాఖ ఎవ్వరు అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఆమె మరెవ్వరో కాదండోయ్.. టెలివిజన్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ, మోడల్. తెలుగులో స్పోర్ట్స్  ప్రజెండర్ గా పేరు పొందింది. ముఖ్యంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఐపీఎల్ ను నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 


Also Read : Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

వింధ్య విశాఖ వీడియో వైరల్ 


తాజాగా ఆమె సిరాజ్ గురించి చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ముఖ్యంగా సిరాజ్ ఎలా ఎదిగాడనే దాని గురించి వివరించింది. 2020లో టీమిండియా ఆస్ట్రేలియాకి వెళ్లింది. ఆ సమయంలో మహ్మద్ సిరాజ్ డెబ్యూ చేస్తాడో లేడో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో వాళ్ల నాన్న మహ్మద్ గౌస్ చనిపోయారని వార్త వచ్చింది. క్వారెంటైన్ రెస్ట్రిక్షన్ వల్ల ఇండియన్ టీమ్ తోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ డిసిషన్ ని అప్పటి కోచ్ రవిశాస్త్రీ, అప్పటి కోహ్లీ విరాట్ కోహ్లీ రెస్పెక్ట్ ఇచ్చి బ్యాక్ చేశారు. ఆ సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ లో మహ్మద్ షమీకి ఇంజూరీ కారణంగా సిరాజ్ కి రెండో టెస్ట్ లో అవకాశం లభించింది. ఆడింది కేవలం మూడు టెస్ట్ మ్యాచ్ లే. కానీ ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు సిరాజ్. 13 వికెట్లు తీశాడు. ఇప్పుడు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో ఇంగ్లాండ్ తరపున స్టోక్స్, కార్స్, టంగ్, జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్లు అన్ని మ్యాచ్ లు ఆడలేకపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ లో క్రిస్ వోక్స్ ఇంజూరీ కూడా మనం చూశాం.

టీమిండియా విజయంలో సిరాజ్ కీలక పాత్ర

కానీ బుమ్రా వర్క్ లోడ్ కారణంగా రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడలేదు. అలాగే ప్రసిద్ధ్ కూడా అన్ని మ్యాచ్ లు ఆడలేదు. కానీ టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రమే అన్ని మ్యాచ్ లు ఆడాడు. అర్ష్ దీప్, ఆకాశ్ దీప్ ఇంజూరీ అయ్యారు. అలాంటి సమయంలో సిరాజ్ 186 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్ డ్రా అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు 35 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఓవల్ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సిరాజ్.. జెమీస్మిత్, ఓవర్టన్ లను వరుస ఓవర్లలో సిరాజ్ వెనక్కి పంపాడు. చివర్లో అట్కిన్సన్ ను యార్కర్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టెస్ట్ సిరీస్ 2-2తో ముగిసింది.

?igsh=MTZmY3k0eXNhbDIzZw==

Related News

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

Big Stories

×