BigTV English

Lamborghini Urus SE Launch Date: లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్!

Lamborghini Urus SE Launch Date: లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్!
Advertisement

Lamborghini Urus SE Launch Date Fix: లంబోర్ఘిని.. ఈ పేరు వినగానే వాహన ప్రియుల్లో సరికొత్త జోష్. ఈ కార్ లుక్ అండ్ డిజైన్.. అలాగే సౌండ్‌కు చాలా మంది మంత్రముగ్దులవుతారు. ఈ కారుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ కారుకు సంబంధించి మరో మోడల్ త్వరలో దేశీయ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Lamborghini Urus SE భారతదేశంలో ఆగస్టు 9న న్యూఢిల్లీలో విడుదల కానుంది.


అయితే ఈ Lamborghini Urus SE మోడల్ ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో తన హవా చూపించేందుకు ఆగస్టు 9న దేశీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ Lamborghini Urus SE అనేక ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లతో పాటు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న లంబోర్ఘిని లైనప్‌లో రెండవ మోడల్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీని డిజైన్, ఫీచర్ల విషయానికొస్తే.. లంబోర్ఘిని ఉరుస్ SE మునుపటి మోడళ్ల కంటే మరింత ఆకర్షణీయంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రీడిజైన్ చేయబడిన బోనెట్‌ను ప్రదర్శిస్తుంది.

దానితో పాటు కొత్త LED సిగ్నేచర్, మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగి ఉన్న సన్నని LED హెడ్‌ల్యాంప్‌లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్‌లు, టెయిల్‌గేట్ విభాగం రిఫ్రెష్ చేయబడ్డాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉరుస్ SE 21, 22 లేదా 23 అంగుళాల వీల్స్‌తో అందుబాటులో ఉంది. ఇవన్నీ పిరెల్లి P జీరో టైర్‌లతో అమర్చబడి ఉంటాయి.


Also Read: జూన్‌ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్..పెరిగాయా? తగ్గాయా?

అలాగే క్యాబిన్ లోపల ఉరుస్ SE అప్డేటెడ్ డాష్‌బోర్డ్ ప్యానెల్‌లు, కొత్త AC వెంట్‌లను కలిగి ఉంది. మునుపటి 10.1-అంగుళాల యూనిట్ స్థానంలో కొత్త 12.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఇక Lamborghini Urus SE పవర్ట్రెయిన్, పనితీరు విషయానికొస్తే.. లంబోర్ఘిని ఉరుస్ SE 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 25.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఇది పెట్రోల్ ఇంజన్ 620bhp పవర్, 800Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే 189bhp పవర్, 483Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్ పవర్‌తో 60km మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో ఇది 800bhp పవర్, 950Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 0-100kph సమయాన్ని 3.4 సెకన్లలో.. 312kph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఇది ఎనిమిది-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉటుంది. దీని ధర విషయానికొస్తే.. 2018లో భారతదేశంలో తొలిసారిగా లాంబోర్గినీ ఉరస్ లాంచ్ అయింది. అప్పుడు దీని ధర రూ.3 కోట్లు. తరువాత మోడల్స్ ఉరుస్ పెర్ఫార్మంటే, S లాంచ్ అయ్యాయి. ఇవి వరుసగా రూ.4.22 కోట్లు, రూ.4.18 కోట్ల ధరతో వచ్చాయి. అయితే ఇప్పుడు ఉరుస్ SE దాని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రావడంతో ధర గణనీయంగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Tags

Related News

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Big Stories

×