BigTV English
Advertisement

Lectrix Electric Vehicle : గోట్ సేల్.. రూ.43,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 100కి.మీ మైలేజీ..!

Lectrix Electric Vehicle : గోట్ సేల్.. రూ.43,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 100కి.మీ మైలేజీ..!

Lectrix Electric Vehicle : ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీ.. లెక్ట్రిక్స్ ఈవీ మోడల్‌పై GOAT సేల్ నిర్వహిస్తోంది. ఈ గోట్ సేల్ జూలై 19న స్టార్ట్ అయింది. అయితే ఇది జూలై 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వినియోగదారులు చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుక్కోవచ్చు. అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేల్‌లను తీసుకొస్తుంది. ఆ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాల ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్‌లను ప్రకటిస్తుంది.


అయితే ఇటీవల ఫ్లిప్‌కార్ట్ మరొక కొత్త సేల్‌తో వచ్చింది. ‘గోట్ సేల్’ అంటూ ఓ డీల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ జూలై 20న స్టార్ట్‌ కాగా రేపటితో అంటే జూలై 25తో ముగియనుంది. ఈ డీల్‌లో స్మార్ట్‌ఫోన్లతో సహా ఇతర ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. అందులో ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న గోట్‌సేల్‌లో లెక్ట్రిక్స్ ఈవీను కొనుక్కోవచ్చు. కాగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కంపెనీ.. లెక్ట్రిక్స్ ఈవీ మోడల్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. కేవలం రూ.43,999లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ కూడా అందిస్తుంది.

Also Read: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. ఎథర్‌ను వెనక్కి నెట్టేసిందిగా..!


అయితే ఇందుకోసం బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర రూ. 49,999 ఉండగా.. ఇప్పుడు గోట్ సేల్‌లో కేవలం రూ.43,999లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో ఎప్పట్నుంచో తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక చక్కటి అవకాశం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది.

అయితే దీని సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం కస్టమర్లు ముందుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి చెందిన ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలి. ఆ తర్వాత కంపెనీ యాప్‌లో మీరు కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ కోసం లైఫ్‌టైమ్ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పొందుతారు. కాగా ఈ లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 100 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 50 కి.మీ పరుగులు పెడుతుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందించారు.

Related News

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Amazon Bumper Offer: అమెజాన్‌ భారీ ఆఫర్లు.. హోమ్‌ అవసరాల నుంచి వింటర్‌ ప్రోడక్ట్స్‌ వరకు 70శాతం తగ్గింపు

Aadhar Card New Rules: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!

Gold Rates: దుబాయ్ లోనే కాదు.. బంగారం ఈ దేశాల్లోనూ వెరీ చీప్!

JioMart Offer: రూ.199లో రూ.50 తగ్గింపా?.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కి షాక్ ఇచ్చిన జియోమార్ట్ ఆఫర్..

SIP Investment: 20 ఏళ్లు నెలకు రూ.15 వేలు పెట్టుబడి vs 15 ఏళ్లు నెలకు రూ.20 వేలు పెట్టుబడి.. ఎవరు ఎక్కువ లబ్ది పొందుతారంటే?

Silver Loan: రూటు మార్చిన ఆర్బీఐ, ఇకపై సిల్వర్‌పై కూడా, కస్టమర్లు ఫుల్ ఎంజాయ్

LIC POLICY: ఎల్ఐసీ బంపర్ ఆఫర్ – రూ.490కే లక్ష రూపాయల పాలసీ

Big Stories

×