BigTV English

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. ఎథర్‌ను వెనక్కి నెట్టేసిందిగా..!

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. ఎథర్‌ను వెనక్కి నెట్టేసిందిగా..!

Bajaj Chetak Electric Scooter: ప్రముఖ వాహనాల కంపెనీ బజాజ్ తన టూ వీలర్ సేల్స్‌లో నెంబర్ వన్‌గా పరుగులు పెడుతుంది. అందులోనూ ఎలక్రిక్ స్కూటర్ల విభాగంలో ముందంజలో ఉంది. ఇక ఈ కంపెనీ ఈవీలలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్‌లో అదరగొడుతోంది. గత నెలలో భారతదేశంలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలను క్రాస్ చేయడంతో కంపెనీ ఒక అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. జూన్ 2024లో దాదాపు 16,691 యూనిట్లతో అత్యధిక నెలవారీ అమ్మకాలతో బజాజ్ ఈ ఘనత సాధించింది.


FY2024లో బజాజ్ చేతక్ 1,15,627 యూనిట్లను సేల్ చేసింది. దీని ప్రకారం ఇది ఏథర్ ఎనర్జీ కంటే 7,733 యూనిట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. కానీ TVS మోటార్ కంపెనీ కంటే 74,269 యూనిట్లు వెనుకబడి ఉంది. దీంతో బజాజ్ ఆటో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో రెండవ స్థానంలో ఉంది. అదే సమయంలో రిటైల్ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది.

Also Read: క్లాసిక్ మార్పులతో హ్యుందాయ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ రెడీ.. ఇంజన్, ధర వివరాలిలా..!


బజాజ్ చేతక్ వేరియంట్‌ల విషయానికొస్తే.. బజాజ్ చేతక్ లైనప్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. అందులో బేస్ మోడల్ 2901 ధర రూ.95,998 గా ఉంది. అదే సమయంలో మిడ్-టైర్ అర్బేన్ ధర రూ. 1.23 లక్షలు, టాప్-ఎండ్ ప్రీమియం వేరియంట్ రూ. 1.47 లక్షల ధరతో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను.. ప్రస్తుత 164 నగరాలు, 200 టచ్‌పాయింట్‌ల నుండి దాదాపు 600 షోరూమ్‌లకు మూడు నుండి నాలుగు నెలల్లో విస్తరించాలని యోచిస్తోంది.

కాగా బజాజ్ వాహన సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఆటో జనవరి నుంచి జూన్ 2024 మధ్య కాలంలో 66,512 చేతక్‌లను విక్రయించింది. ఈ పనితీరుతో ఓలా ఎలక్ట్రిక్, TVS మోటార్ కంపెనీ తర్వాత రిటైల్ అమ్మకాలలో 3వ స్థానాన్ని కలిగి ఉంది. కాగా FY2025కి బజాజ్ ఆటో మరిన్ని వాహనాలను సేల్ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంచి భవిష్యత్తును సూచిస్తుంది. కంపెనీ దాని డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో డిమాండ్ వృద్ధితో బజాజ్.. TVS iQube వంటి పోటీదారులను తగ్గించే ప్రయత్ని చేస్తుంది. కంపెనీ దాని లక్ష్యంతో పోటీ తత్వం ఉన్న దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తుంది.

Related News

Theft In DMart: డిమార్ట్‌ లో ఇలా చేస్తున్నారా? ఇదిగో ఇతడిలాగానే బుక్కైపోతారు జాగ్రత్త!

Blinkit New Feature: సూపర్.. బ్లింకిట్ కొత్త ఆప్షన్.. స్విగ్గీ, జెప్టోలో లేని ఫీచర్..

Protest Against D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

×