Indian Railway Stations: భారతదేశ రవాణా వ్యవస్థలో రైల్వే సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. దేశ వ్యాప్తంగా 7 వేల 364 స్టేషన్లు, సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లను కలిగి ఉంది. నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు రైలు మార్గంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ అయిన భారతీయ రైల్వే సంస్థ ఎన్నో ప్రత్యేకతలతో పాటు వింతలు, విశేషాలను కలిగి ఉంది. ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం..
భారత్ లో అత్యంత పొడవైన పేరున్న రైల్వే స్టేషన్
భారత్ లో బోలెడు స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని యూనిక్ స్టేషన్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి వెంకటనరసింహరాజువారిపేట(Venkatanarasimharajuvariipeta) రైల్వే స్టేషన్. దేశంలోనే అతి పొడవైన పేరున్న రైల్వేస్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ పేరులో ఏకంగా 29 ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చే సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, రేణిగుంట నుంచి తమిళనాడులోని అరక్కోణం వెళ్లే రైలు మార్గం మధ్యలో ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది.
‘Venkatanarasimharajuvaripeta’ #RailwayStation on the #TamilNadu – #AndhraPradesh border has the longest single-word name for a railway station in #India. The station, whose name has 28 letters. The longest name is #Chennai‘s PuratchiThalaivarDrM.G.Ramachandran Central Station. pic.twitter.com/HajtkCZSeL
— Ch.M.NAIDU (@chmnaidu) August 24, 2024
భారత్ లో అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్
భారత్ లో అత్యంత పొడవైన పేరు ఉన్నట్లుగానే అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్ ఒడిషా రాష్ట్రంలో ఉంది. భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని అన్ని స్టేషన్ల కంటే చిన్నపేరు ఇదే. అది ఆ స్టేషన్ మరేదో కాదు ‘ఐబి’(IB) రైల్వే స్టేషన్. ఈ ప్రసిద్ధ స్టేషన్ కు మహానది ఉపనది అయిన ఐబ్ నది నుండి దాని పేరు వచ్చింది. ఈ స్టేషన్ పేరులో కేవలం రెండు అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఒడిశాలోని బిలాస్ పూర్ డివిజన్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ పేరులోనే కాదు.. నిజంగానే చాలా చిన్నగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో రెండు ఫ్లాట్ ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అన్ని రైళ్లు ఆగవు. పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. అది కూడా కేవలం 2 నిమిషాలే హాల్ట్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కు రెండు అనే నెంబర్ కు ఏదో అవినాభావ సంబంధం ఉందంటూ రైల్వే ప్రయాణీకులు సరదాగా కామెంట్ చేస్తుంటారు.
Did You Know?
Ib Railway Station in Odisha has the shortest name amongst all stations on the Indian Railways Network. It derives its name from the Ib River, which is a tributary of Mahanadi. pic.twitter.com/rkwdTdNNVl
— Ministry of Railways (@RailMinIndia) September 25, 2022
Read Also: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?