E-Paper
Advertisement

Witchcraft Daughter Kills: ‘తల్లిని చంపి ముక్కలుగా నరికి ఒళ్లంతా రక్తంతో’.. అమెరికాలో క్షుద్ర పూజ!

Witchcraft Daughter Kills: ‘తల్లిని చంపి ముక్కలుగా నరికి ఒళ్లంతా రక్తంతో’.. అమెరికాలో క్షుద్ర పూజ!
Advertisement

Witchcraft Daughter Kills| అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మూఢనమ్మకాలు పాటించేవారున్నారని చెబితే నమ్మశక్యం కాదు. కానీ తాజాగా అక్కడ ఒక హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేతబడి, క్షుద్రపూజలు చేసే ఒక యువతి ఏకంగా తన తల్లిని బలి ఇచ్చింది. ఈ ఘటన అమెరికాలోని కెన్‌టకీ రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కెన్ టకీ లోని బ్రెయిర్లీ రిడ్జ్ రోడ్ లో నివసించే 54 ఏళ్ల ట్రూడీ ఫ్రీల్డ్స్ అనే మహిళ ఇటీవల తన ఇంటిని విక్రయించాలని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని సంప్రదించింది. దీంత వారం రోజుల క్రితం.. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆమెను కలవడానికి వెళ్లాడు. కానీ ట్రూడీ ఫీల్డ్స్ ఇంటి సమీపంలో గడ్డిపై అంతా రక్తపు మరకలు కనిపించాయి. ఆ రక్తపు మరకలు చూసిన అతను మెల్లగా ఆ మరకలున్న దారిలో నడుచుకుంటూ వెళ్లాడు. కొంత దూరంలో నరికివేసిన ఒక మనిషి కాలు కనిపించింది. అది చూసి అతను వెంటనే అక్కడి నుంచ పారిపోయి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రక్తపు మరకలును చూసి ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నించగా.. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో పోలీసులు మైక్ లో ఇల్లు తెరవాలని.. లేకపోతే తలుపులు పగలగొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ ఎవరూ తలుపులు తీయలేదు. కాసేపు ఎదురు చూసిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఒక 32 ఏళ్ల యువతి శరీరమంతా రక్తపు మరకలతో కళ్లు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తోంది.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Advertisement

పోలీసులు ఆమెను అదులోకి తీసుకొని.. ఇల్లంతా తనిఖీ చేయగా.. బెడ్ రూమ్ లో పరుపు, దిండుపై అంతా రక్తపు మరకలున్నాయి. ఆ తరువాత పోలీసులు ఇంటి వెనుక భాగంలో వెళ్లి చూడగా.. అక్కడ ఒక మహిళ శవం ముక్కలు ముక్కలు వరండాలో చెల్లాచెదురుగా పడి ఉంది. పోలీసులు ఇంటి ఇంకా లోతుగా పరిశీలించారు. పోలీసులకు కిచెన్ లో కొన్ని మానవ శరీర భాగాలు కుక్కర్ లో ఉడికించి ఉన్నాయి. దీంతో పోలీసులు ఆ యువతి గురించి ఆరా తీశారు. ఆమె మరెవరో కాదు టోరిలీనా ఫీల్డ్స్ .. ఇంట్లో లభించిన శవం ఆమె తల్లి ట్రూడీ ఫీల్డ్స్ ది.

పోలీసుల కథనం ప్రకారం.. టోరిలీనా ఫీల్డ్స్ కు క్షుద్రపూజ చేసే అలవాటు ఉండేది. ఆమె తల్లికి ఇదంతా ఇష్టముండేది కాదు. తన కూతురిని ఆమె క్షుద్రపూజ చేయకూడదని కఠినంగా చెప్పింది. కానీ టోరిలీనా ఫీల్డ్స్ తల్లి మాటలు వినలేదు. ఈ క్రమంలో ట్రూడీ ఫీల్డ్స్ ఆమెను తన ఆస్తి ఇవ్వకూడదని నిశ్చయించింది. అందుకే తన ఇంటికి విక్రయించేయాలని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని సంప్రదించింది. అయితే ఆ ఏజెంట్ ఇల్లు కొనేందుకు ఒక కస్టమర్ గురించి చెప్పడానికి వస్తున్నాడని తెలిసి.. టోరిలీనా తన తల్లిని చంపి ఆమె రక్తంతో క్షుద్రపూజ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో తల్లి మాంసాన్ని వండుకొని తిన్నది.

ప్రస్తుతం పోలీసులు టోరిలీనాపై హత్య, మృతదేహాన్ని అవమానించిందుకు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×