OTT Movie : హాలీవుడ్ మూవీస్ లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఊహించుకోలేము. థియేటర్లలో సందడి చేసిన హాలీవుడ్ మూవీస్ ను తక్కువ సమయంలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రొమాన్స్, కామెడీ చిత్రాలను ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. అందులోనూ ఆ జానర్లో వచ్చే హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంటుంది. యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ, రొమాంటిక్ చిత్రాల కోసం ఎదురుచూసే ఓటిటి లవర్స్ కు ఒక అదిరిపోయే కామెడీ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
ఈ మూవీలో కొడుకు ఫ్రెండ్ తో రొమాన్స్ చేసే మహిళ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. బో*ల్డ్ సన్నివేశాలతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘బిహేవింగ్ బ్యాడ్ లీ’ (Behaving Badly). ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళితే..
రిక్ అనే టీనేజ్ కుర్రాడు ఉంటాడు. అతని తల్లి పేరు లూసీ. ఒకరోజు లూసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. రిక్ తనని కాపాడి హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంటుందో చూపుతూ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తారు. రిక్ కు బ్రదర్, సిస్టర్ ఉంటారు. సిస్టర్ ఒక క్లబ్బులో పని చేస్తూ ఉంటుంది. అందులో జిమ్ అనే వ్యక్తి కూడా పని చేస్తూ ఉంటాడు. రిక్ కు బిల్ అనే ఒక మంచి స్నేహితుడు ఉంటాడు. ఒకరోజు రిక్ తన స్నేహితుడు బిల్ ఇంటికి వెళతాడు. అక్కడ అనుకోకుండా బిల్ వాళ్ల మమ్మీ తో ఇంటిమేట్ అవుతాడు. వ్యవహారం ఇలా సాగుతుంటే, బిల్ తన క్లాస్మేట్ నీనా అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఒక పాప్ సింగర్ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో ఆ షోకి నిన్ను తీసుకెళ్తానని అబద్ధం చెప్తాడు. అలాగే షో కి డబ్బు అవసరం ఉండటంతో జిమ్ ను అడుగుతాడు. జిమ్ డ్రగ్ అతనికి ఇచ్చి ఇది వేరే వాళ్లకు ఇస్తే నీకు డబ్బులు ఇస్తానని చెప్తాడు. అలా వీరు వెళ్తుండగా కారులో ఒక శవం దొరుకుతుంది. పోలీసులు రిక్ ను విచారిస్తారు. అక్కడ ఒక లాయర్ రిక్ ను బయటకు తీసుకొస్తుంది. వారిద్దరూ కారులో ఉండగా ఆ డ్రగ్స్ ను వాడి రొమాన్స్ కి ట్రై చేస్తుంది. రిక్ నీనాను లవ్ చేస్తుండటం వలన ఆమెతో రొమాన్స్ చేయలేకపోతాడు. ఆ తర్వాత రిక్ కు, బిల్ వాళ్ళ మమ్మీ తో రిలేషన్ లో ఉందని తెలిసిపోతుంది. ఆ సిట్యువేషన్ నుంచి రిక్ ఎలా బయటపడగలిగాడు ? ఆ కారులో ఉన్న వ్యక్తి శవం ఎవరిది? బిల్ వాళ్ళ మమ్మీతో రిలేషన్ కంటిన్యూ అవుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే రొమాంటిక్ కామెడీ కలిపి ఉన్న ఈ మూవీని చూడాల్సిందే. మసాలా సన్నివేశాలు కొంచెం ఎక్కువగా ఉన్న ఈ సినిమాని కూడా ఒంటరిగా చూడడమే మంచిది.