BigTV English
Advertisement

Electric Cars Under Rs 15 Lakhs: 300కి పైగా మైలేజీతో దూసుకుపోయే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Electric Cars Under Rs 15 Lakhs: 300కి పైగా మైలేజీతో దూసుకుపోయే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. తక్కువ ధరలో ఎక్కువ  ఫీచర్లు..

Electric Cars Suitable for City Under Rs 15 Lakhs: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా.. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహవానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం.. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగటమే. దీంతో వాహన ప్రియులు ఎక్కువగా ఈవీలపై ఆసక్తి చూపిస్తున్నారు.


అందులోనూ ఎక్కువగా బైక్స్, కార్లపై ఫోకస్ పెడుతున్నారు. అయితే మీరు కూడా మంచి బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన మంచి ఎలక్ట్రిక్ కారును కొనుక్కోవాలనుకుంటున్నారా?.. అయితే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ఈ మధ్య లాంచ్ అయిన ప్రతి మోడల్ దాదాపు రూ.30 లక్షల ధరకు పైగానే రిలీజ్ అయ్యాయి. అందువల్ల బడ్జెట్ ధరలో రూ.15 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం..

MG Comet EV


MG కామెట్‌కు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. చూడటానికి చిన్నగానే ఉన్నా.. రోడ్లపై రయ్ రయ్ మని పరుగులు పెడుతుంది. ఇది కేవలం రూ.6.99 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. దీనికి ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ పెడితే.. దాదాపు 230కిమీల వరకు పరుగెత్తుతుంది. ఇది మొత్తం ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఎఫ్‌సి, ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Also Read: మార్చి నెలలో లాంచ్ అయిన సూపర్ కార్స్ ఇవే.. మీరే ఓ లుక్కేయండి!

ఈ కారు బయటి నుండి కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. కానీ లోపల నుండి విశాలమైనది. ముఖ్యంగా ఇరుకైన ప్రదేశాలలో నడపడం సులభం. ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అనేక టెక్నాలజీ లక్షణాలను కలిగి ఉంది. 55కి పైగా i-SMART టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో అందించబడ్డాయి.

Tata Tiago EV

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కాంపాక్ట్, స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్. ఇది అందంగా కనిపించడమే కాకుండా మంచి డ్రైవింగ్ పరిధిని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

దీని ఫ్రంట్ గ్రిల్, ఖరీదైన లెథెరెట్ అప్హోల్స్టరీ వంటివి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ వాహనం కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇది EV వేరియంట్లలో కాకుండా.. పెట్రోల్, CNG వెర్షన్లలో కూడా వస్తుంది.

Also Read: నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?

Tata Punch EV

టాటా పంచ్ కూడా మంచి ఫీచర్లతో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. దీన్ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని కలిగి ఉంది. అదే సమయంలో, దాని మూడ్ లైట్లు మీకు ఇష్టమైన పాట ట్యూన్‌తో అందించబడతాయి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది

Citroen ec3 EV

సిట్రియోన్ ఈసీ 3 కేవలం రూ. 12.69 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 320 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 29.2KW. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు స్టైల్ కావాలనుకునే వారికి ఇది మంచిది. దీన్ని కేవలం 57 నిమిషాల్లో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×