E-Paper
Advertisement

సర్కార్ ఆదాయ వేట.. హైదరాబాద్ పారిశ్రామిక భూములపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

సర్కార్ ఆదాయ వేట.. హైదరాబాద్ పారిశ్రామిక భూములపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: ‎రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో సాధించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ భూములు,పారిశ్రామిక లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఈ ప్రక్రియలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.

ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష

Advertisement

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు స్పష్టమైన లక్ష్యాలు, శాఖల మధ్య సమన్వయం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి శాఖ వారాలవారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. పారిశ్రామిక లేఅవుట్లు, పాత పారిశ్రామికవాడల్లో భూముల వినియోగం, క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటికే సమకూరిన ఆదాయం, వివిధ దశల్లో ఉన్న ప్రతిపాదనల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు

అధికారులకు ఆదేశాలు..

Advertisement

అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. బీ-కేటగిరీ, సూక్ష్మ పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి వారాలవారీగా లక్ష్యాలను నిర్ణయించి, సంబంధిత అధికారులకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించాలని సూచించారు. రోజువారీ పురోగతిని పర్యవేక్షించడం ద్వారా పారిశ్రామికవేత్తలకు వేగవంతమైన, సులభతరమైన సేవలు అందేలా చూడాలన్నారు.
‎
ప్రజాభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష..

మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో మైనార్టీల అభ్యున్నతి గురించి సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలో భాగంగా శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మైనార్టీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. మైనార్టీలకు విద్యా అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు.

Also Read: మహిళల చేతిలో తేనె పరిశ్రమ.. గ్రామీణ వనితలకు తియ్యని ఉపాధి!

Tags

Related News

మహిళల చేతిలో తేనె పరిశ్రమ.. గ్రామీణ వనితలకు తియ్యని ఉపాధి!

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు.. కొత్తగా ఐదు కీలక పదవులు.. ఢిల్లీ స్థాయిలో నేతల లాబీయింగ్!

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు.. నలుగురు అరెస్టు!

ప్రయాణికులకు దీపావళి ధమాకా.. భారీగా తగ్గిన మెట్రో, ఆర్టీసీ జాయింట్ పాస్‌ల ధరలు!

రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!

9 రోజులు.. 350 కి.మీ.. సీఎం రేవంత్‌ను కలిసిన అభిమాని

ఇది అతివృష్టి కాదు.. అనావృష్టి కాదు.. రేవంత్ వృష్టి! – హరీష్ రావు

Big Stories

Advertisement
×